News April 12, 2025
కృష్ణా జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిన మొవ్వ ప్రభుత్వ జూనియర్ కళాశాల

ఇంటర్మీడియట్ ఫలితాల్లో మొవ్వ క్షేత్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు 87% ఉత్తీర్ణతతో జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. 83.5% ఉత్తీర్ణతతో అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాల రెండవ స్థానంలో, 79% ఉత్తీర్ణతతో మచిలీపట్నంలోని లేడి యాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మూడో స్థానంలో నిలిచింది. ఉత్తమ ఫలితాలు సాధించిన ఆయా కళాశాలల యాజమాన్యాలను ఇంటర్ బోర్డు జిల్లా అధికారి సాల్మన్ రాజు అభినందించారు.
Similar News
News April 12, 2025
కృష్ణా: ఒకేషనల్ కోర్సులో జిల్లా టాపర్‌గా గాయత్రి

నేడు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఒకేషనల్ కోర్సుకు సంబంధించి మచిలీపట్నం లేడి యాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన గాయత్రి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గుడ్లవల్లేరుకు చెందిన గాయత్రి 1000కి 988 మార్కులు సాధించి జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థినిని కాలేజీ ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ సుందర లక్ష్మి అభినందించారు.
News April 12, 2025
ఇంటర్ ఫలితాల్లో జిల్లా ఫస్ట్ ర్యాంక్ మన బందరు అమ్మాయికే

నేడు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో మచిలీపట్నం లేడి యాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన ఎ.బాల త్రిపుర సుందరి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. క్యాంబెల్ పేటకు చెందిన త్రిపుర సుందరి 1000 మార్కులకు గాను 980 మార్కులు సాధించి జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఆ విద్యార్థినిని కాలేజీ ప్రిన్సిపల్ అభినందించారు.
News April 12, 2025
కృష్ణా: ఎస్సీ కార్పొరేషన్ బ్యాంక్ లింక్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుపేద ఎస్సీల స్వయం ఉపాధికై బ్యాంక్ లింకేజీ రుణాలకు సంబంధించి దరఖాస్తులను ఈనెల 14వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు మే 10వ తేదీలోపు https:///apobmms.apcfss.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.