News May 7, 2025
కృష్ణా జిల్లాలో మత్స్యకారులకు రూ.26.15 కోట్ల భృతి

సముద్రంలో వేట నిషేధ కాలానికి సంబంధించి మత్స్యకారుల జీవనోపాధికై రూ.20వేలు చొప్పున భృతిని శనివారం అందజేయనున్నారు. జిల్లాలో 2,263 మెకనైజ్డ్, మోటరైజ్డ్, నాన్ మోటరైజ్డ్ బోట్లు ఉండగా 13,077 మంది మత్స్యకారులను అర్హులుగా గుర్తించారు. వీరికి రూ.20వేలు చొప్పున రూ.26.15కోట్లు మంజూరైనట్టు మత్స్య శాఖ జేడీ తెలిపారు. ఈ మొత్తాన్ని మధ్యాహ్నం 12గంటలకు కలెక్టరేట్ కలెక్టర్ డీకే బాలాజీ చేతుల మీదుగా అందజేయనున్నారు.
Similar News
News September 7, 2025
కృష్ణా: 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా రెడీ

జిల్లాలో రైతులకు 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ తెలిపారు. ఆదివారం పామర్రు, గూడూరు మండలాల పర్యటన అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, అధికారులతో సమావేశమై యూరియా స్థితిగతులపై సమీక్షించారు. అవసరమున్న రైతులకు ప్రాధాన్యతగా సరఫరా చేయాలని సూచించారు.
News September 7, 2025
మచిలీపట్నం: పర్యాటకుల జేబుకు చిల్లు..!

మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో అధిక ధరలు వసూలు చేస్తున్నారని పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.20 విలువ చేసే వాటర్ బాటిల్‌ను రూ.25కు అమ్ముతున్నారు. ఇతర ఫాస్ట్ ఫుడ్స్‌పై కూడా ఇష్టానుసారంగా ధరలు పెంచి అమ్ముతున్నారని వాపోతున్నారు. వ్యాపారులంతా సిండికేట్ అయి దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్‌లోనూ ఇదే పరిస్థితి ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
News September 7, 2025
మచిలీపట్నంలో చికెన్ ధర ఎంతంటే?

మచిలీపట్నంలో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. స్కిన్ లెస్ కేజీ రూ.220, స్కిన్‌తో అయితే రూ.200కి లభిస్తోంది. కొన్ని చోట్ల డిమాండ్‌ను బట్టి ధరల్లో స్వల్ప మార్పులున్నాయి. మటన్ ధర యథావిధిగా రూ.800 -1000 మధ్య కొనసాగుతుంది. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.