News January 3, 2026
కృష్ణా జిల్లాలో రహదారుల విప్లవం.. సాధిస్తే అద్భుతమే.!

ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా NHAI, ఉన్నతాధికారులతో MP, MLAలు సమావేశం నిర్వహించారు. విజయవాడ నగరంపై ఒత్తిడి తగ్గించేలా NH-65, NH-16లను అనుసంధానిస్తూ కంకిపాడు-కేసరపల్లి, పోరంకి-నిడమానూరు, తాడిగడప-ఎనికేపాడు మార్గాల్లో 3’స్పర్ రోడ్ల’ను ప్రతిపాదించారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి వచ్చే వారు విజయవాడ రాకుండానే వెస్ట్ బైపాస్ చేరుకునేలా కేసరపల్లి-వెదురుపావులూరు మధ్య కొత్త రహదారి నిర్మించాలని కోరారు.
Similar News
News January 3, 2026
గన్నవరం: మంచు అడ్డంకి.. గాల్లోనే సింగపూర్ విమానం చక్కర్లు

పొగమంచు కారణంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శనివారం ఉదయం సింగపూర్ నుంచి వచ్చిన విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో ల్యాండింగ్‌కు వీలుపడక గాల్లోనే చక్కర్లు కొట్టింది. రన్‌వే సరిగ్గా కనిపించకపోవడంతో పైలట్లు విమానాన్ని దించలేకపోయారు. వాతావరణం మెరుగుపడిన తర్వాతే ల్యాండింగ్‌కు అనుమతిస్తామని, ప్రయాణికులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఎయిర్‌పోర్ట్ వర్గాలు వెల్లడించాయి.
News January 3, 2026
NLG: పట్టణాల్లో వేడెక్కిన పుర రాజకీయాలు!

మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం తెర లేపడంతో ఒక్కసారిగా పట్టణాలలో ఎన్నికల సందడి నెలకొంది. గత నెలలో పంచాయతీ ఎన్నికలతో వేడెక్కిన గ్రామాలు, శీతాకాలం సంక్రాంతి వేళ పందేల సమయంలో పట్టణాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉమ్మడి జిల్లాలో 19 మున్సిపాలిటీలకు గాను 18 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్నాయి. EC ఆదేశాలతో గత వారం రోజులుగా అధికారులు ఎన్నికల నిర్వహణలో తలమునకలు కావడంతో ఆశావహులు హుషారుతో ఉన్నారు.
News January 3, 2026
8 నుంచి ‘ఆవకాయ్-అమరావతి’ ఉత్సవాలు: కలెక్టర్

విజయవాడలో ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు ‘ఆవకాయ్-సినిమా, సంస్కృతి, సాహిత్య అమరావతి ఉత్సవాలు’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పున్నమి ఘాట్, భవానీ ద్వీపంలో జరిగే ఈ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సందర్శకుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, వైద్య శిబిరాల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.


