News May 1, 2024
కృష్ణా జిల్లాలో రేపటి నుంచి హోమ్ ఓటింగ్

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రేపటి నుంచి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందు కోసం జిల్లాలో 35 బృందాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. 85సం పైబడిన వారు, 40% పైబడి అంగవైకల్యం కలిగి హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు ఈ బృందాలు వెళ్లి ఓటు వేయించనున్నాయి. ఒక్కో బృందంలో ఒక PO, APO, వీడియో గ్రాఫర్ ఉంటారు. 10వ తేదీ వరకు హోమ్ ఓటింగ్ ప్రక్రియ జరగనుందని తెలిపారు.
Similar News
News April 21, 2025
కృష్ణా: 131 మంది దివ్యాంగులకు ఉపకరణాలు అందజేత

జిల్లాలో 131 మంది విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు సైకిళ్లను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అందించారు. మెడికల్ క్యాంప్‌ల ద్వారా గుర్తించిన వీరికి రూ.15లక్షలు విలువ చేసే ట్రై సైకిల్స్, ఇతర ఉపకరణాలను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరితోపాటు పాఠశాలల్లో సమానంగా చదువుకోవడానికి ఈ ఉపకరణాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
News April 21, 2025
VJA ఆటోనగర్ లాడ్జీల్లో తనిఖీలు

విజయవాడ ఆటోనగర్‌లోని లాడ్జీల్లో శనివారం అర్ధరాత్రి పటమట పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా పేకాట ఆడుతున్న ఐదుగురిని, వ్యభిచారం చేస్తున్న ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పటమట పోలీసులు తెలిపారు.
News April 21, 2025
కృష్ణా: బాబోయ్ అడ్మిషన్‌లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్

కృష్ణా జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో అయితే టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తెస్తేనే జీతాలు ఇస్తామంటూ హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు.