News August 18, 2025
కృష్ణా జిల్లాలో 43 కొత్త బార్‌లు

కృష్ణా జిల్లాలో త్వరలోనే 43 బారులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ అధికారులు గెజిట్ నోటిఫికేషన్‌కు సిద్ధమవుతున్నారని ఎక్సైజ్ అధికారి గంగాధర్ రావు తెలిపారు. ఈ బార్‌లలో నలుగురిని గీత కార్మికుల కోటా కింద కేటాయించగా, మిగతా బారులు ఓపెన్ క్యాటగిరీలో ఉంటాయి. ఓపెన్ క్యాటగిరీలో బార్‌ల కోసం దరఖాస్తుల సమర్పణకు ఈనెల 26వ తేదీ చివరి రోజు కాగా, గీత కార్మికుల కోటా దరఖాస్తులకు 29వ తేదీ వరకు గడువు ఉంది.
Similar News
News August 18, 2025
మచిలీపట్నంలో మీకోసం కార్యక్రమం

మచిలీపట్నం కలెక్టరేట్‌లోని పి.జి.ఆర్.ఎస్ సమావేశ హాల్‌లో ‘మీ-కోసం’ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. కలెక్టర్ డీకే బాలాజీ, జేసీ గీతాంజలి శర్మ, సహాయ కలెక్టర్ ఫర్హీన్ జాహిద్ తదితర అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించి, నిర్ణీత గడువులో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
News August 18, 2025
కృష్ణా: హంసలదీవి బీచ్ గేట్లు మూసివేత

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పాలకాయతిప్ప వద్ద ఉన్న హంసలదీవి బీచ్ గేట్లను మూసివేసినట్లు అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ నాగమణి సోమవారం తెలిపారు. కృష్ణా జిల్లాలో రానున్న 48 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, 3 రోజుల పాటు గేట్లను మూసివేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి, బీచ్‌వైపు రావద్దని ఆమె కోరారు.
News August 18, 2025
కృష్ణా: పంట పొలాల్లో వీడని ముంపు.. రైతుల ఆందోళన

వర్షాలు తగ్గి ఆరు రోజులు గడిచినా, వాయుగుండం ప్రభావంతో వరి పొలాల నుంచి నీరు బయటకు పోవడం లేదు. సముద్రం ఎగతన్నడంతో డ్రెయిన్లలో మురుగు నీరు దిగువకు ప్రవహించే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వరి దుబ్బులు కుళ్లిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ముంపునకు గల కారణాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.