News August 22, 2025
కృష్ణా జిల్లాలో 5 వేల అప్లికేషన్ల తిరస్కరణ!

ఈ నెల 25న స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇందులో కృష్ణా జిల్లాలో గతంలో 5.11 లక్షలు, కొత్తగా 11 వేల అప్లికేషన్లు కలిపి 5.22 లక్షలు రాగా.. పున:పరిశీలన తర్వాత చివరికి 5.17 లక్షల డిజిటల్ కార్డులను మాత్రమే ప్రకటించారు. కొత్తగా వచ్చిన అప్లికేషన్లలో దాదాపు 5 వేల వరకు తిరస్కరణకు గురైనట్లు సమాచారం. అర్హత ఉండి కార్డు పొందలేని వారు సచివాలయాన్ని సంప్రదించాలని అధికారులు చెప్తున్నారు.
Similar News
News August 22, 2025
కృష్ణా: కానిస్టేబుల్ అభ్యర్థుల సర్టిఫికెట్స్ పరిశీలన

జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. ఎస్పీ ఆర్.గంగాధరరావు నేతృత్వంలో సర్టిఫికెట్స్ పరిశీలన జరిగింది. ఎస్పీ మాట్లాడుతూ.. అభ్యర్థుల విద్యార్హతలు, క్రీడా సర్టిఫికేట్లు, కేటగిరీకి సంబంధించిన ధ్రువపత్రాలు సహా అన్ని అవసరమైన పత్రాలను సక్రమంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
News August 21, 2025
సంధ్యాసమయంలో కృష్ణా తీరం అందాలు

కృష్ణా నదీ తీరంలోని నాగాయలంక శ్రీరామపాదక్షేత్రం వద్ద గురువారం సూర్యాస్తమయం వేళ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది. సాయంత్రపు గాలులు, నది అలల తాకిడి, గగనంలో రంగుల వర్ణచిత్రం ఆ ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా మార్చాయి. భక్తులు, సందర్శకులు ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ, పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మికతను అనుభవించారు.
News August 21, 2025
మచిలీపట్నం: ఎస్పీని కలిసిన డీఎస్పీ

కృష్ణా జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ నూతన DSP కె.ధర్మేంద్ర గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావును మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ, శక్తి టీమ్స్ పనితీరును పర్యవేక్షించాలని ఎస్పీ సూచించారు. ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్ నివారణతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని DSPకి వివరించారు.