News September 3, 2025

కృష్ణా జిల్లాలో 73 ఎస్సీ గ్రామాలకు శ్మశానాలు లేవు

image

కృష్ణా జిల్లాలో 73 ఎస్సీ గ్రామాలకు శ్మశానవాటికలు లేవని ఎస్సీ సంక్షేమ శాఖ గుర్తించింది. ఈ మేరకు గుడివాడలో 15, మచిలీపట్నంలో 15, ఉయ్యూరులో 43 గ్రామాలకు మొత్తం 72.98 ఎకరాలు కేటాయించాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికను తాజాగా భూసేకరణ చీఫ్ కమిషనర్ (CCLA)కు అందజేసింది.

Similar News

News February 10, 2026

కృష్ణా జిల్లాలో శివరాత్రికి భారీ బందోబస్తు – ఎస్పీ విద్యాసాగర్

image

మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని శైవక్షేత్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు మంగళవారం తెలిపారు. ప్రధానంగా 7 క్షేత్రాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, సీసీ, డ్రోన్ కెమెరాల పర్యవేక్షణతో పాటు మహిళా పోలీసులను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు తోపులాట లేకుండా క్యూలైన్లలో క్రమశిక్షణతో దర్శించుకోవాలని, పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

News February 10, 2026

కృష్ణా: సంక్షోభంలో ఇటుక పరిశ్రమ..!

image

కృష్ణా జిల్లాలో ఇటుక పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలు మందగించడంతో ఇటుకలకు గిరాకీ పూర్తిగా పడిపోయింది. లక్షల ఇటుకలు నిల్వ ఉన్నా కొనేవారు లేరు.. అప్పులు తెచ్చి బట్టీలు నడుపుతున్నాం అని నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. అమ్మకాలు లేక, ఆదాయం రాక వేల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని, ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

News February 9, 2026

మచిలీపట్నంలో ‘వందేమాతరం’ కోస్టల్ సైక్లోథాన్ ప్రారంభం

image

మచిలీపట్నంలోని కోనేరు సెంటర్లో CISF ఆధ్వర్యంలో సోమవారం ‘వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్-2026’ మెగా సైకిల్ ర్యాలీ ఘనంగా ప్రారంభమైంది. దేశ రక్షణ, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ సుమారు 6,500 కి.మీ మేర సాగే ఈ భారీ యాత్రను అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. తీర ప్రాంత భద్రతలో ప్రజలను భాగస్వామ్యం చేయడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం.