News April 17, 2025
కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జి. గోపి బాధ్యతలు

కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జి. గోపి గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన న్యాయమూర్తుల బదిలీల్లో భాగంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న అరుణ సారెక చిత్తూరుకు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో విశాఖపట్నం వ్యాట్ కోర్టు అప్పలెట్ జడ్జిగా ఉన్న గోపి నియమితులయ్యారు. నేడు ఆయన జిల్లా జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు.
Similar News
News September 9, 2025
కృష్ణా: బ్యూటిఫుల్ మూన్

బాపులపాడు గన్నవరం ఉంగుటూరు మండలాలలో ఆకాశం తన అందాలతో మంగళవారం రాత్రి మాయ చేసింది. నింగిలో మెరిసిన నిండు చంద్రుడు ప్రజల చూపులను కట్టిపడేశాడు. వెండి వెలుగులు విరజిమ్ముతూ ప్రకృతి తన మహిమను ఆవిష్కరించింది. నగరాల్లోనూ, గ్రామాల్లోనూ ఆ వెన్నెల విందు చూసేందుకు ప్రజలు ఆసక్తిగా బయటకు వచ్చి చిత్రాల్లాంటి దృశ్యాలను కెమెరాలో బంధించారు. మరి మీ ప్రాంతంలో ఈరోజు చంద్రుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి.
News September 9, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు: కృష్ణా ఎస్పీ
☞ ఉమ్మడి కృష్ణాజిల్లాలో 105 R&B రోడ్లు ధ్వంసం
☞ కృష్ణా జిల్లా వ్యాప్తంగా వైసీపీ అన్నదాత పోరు కార్యక్రమం
☞ మచిలీపట్నం – రేపల్లె రైల్వే లైనుకు కృషి చేయాలి: బాలశౌరి
☞ మోపిదేవి ఆలయంలో భక్తుల రద్దీ
News September 8, 2025
MTM: మీకోసం కార్యక్రమంలో 42 ఫిర్యాదులు

మచిలీపట్నంలో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ఆర్. గంగాధరరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 42 ఫిర్యాదులు అందగా, ప్రతి సమస్యపై చట్టపరమైన విచారణ జరిపి తక్షణ పరిష్కారం అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. సంబంధిత పోలీస్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.