News March 30, 2025

కృష్ణా జిల్లా TODAY TOP NEWS

image

☞ గన్నవరం: 3 గంటలసేపు వంశీని విచారించిన పోలీసులు☞ కృష్ణా: క్రికెట్ బెట్టింగ్ గుర్తు రట్టు☞ రేపు ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్‌కు సీఎం☞ కృష్ణా: పెరుగుతున్న ఎండలు.. ఆందోళనలో ప్రజలు ☞ కృష్ణా: MBA,MCA ఫలితాలు విడుదల☞ పెదకళ్ళేపల్లి చెరువులో పడిన మహిళ గుర్తింపు☞ కూచిపూడి జిల్లాలో ఉండటం గర్వ కారణం: కలెక్టర్☞ ఆత్కూర్ వద్ద గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

Similar News

News April 1, 2025

కృష్ణా: ప్రయాణికులకు అలర్ట్.. స్టాప్ తొలగించిన రైల్వే

image

నాన్ ఇంటర్‌ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా ప్రయాణించే పలు రైళ్లకు మహబూబాబాద్(TG)లో తాత్కాలికంగా స్టాప్ తొలగించామని రైల్వే అధికారులు తెలిపారు. మే 24 నుంచి 28 వరకు నం.12749 మచిలీపట్నం-బీదర్‌ SF ఎక్స్‌ప్రెస్, నం.12709 గూడూరు-సికింద్రాబాద్ సింహపురి SF, నం.12759 తాంబరం-హైదరాబాద్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లు మహబూబాబాద్‌లో ఆగవని, ప్రయాణికులు గమనించాలని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.

News April 1, 2025

కృష్ణా: ‘పరీక్ష తర్వాత పేపర్లు చించకూడదు’

image

10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారం నిర్వహించే సోషల్ పరీక్షతో ముగిస్తాయి. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచినీరు ఏర్పాటు చేయాలని డీఈవో రామారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆఖరి పరీక్ష కావడంతో విద్యార్థులు పరీక్షా అనంతరం పుస్తకాలు చించి వేసి బయట వేయడం వంటివి చేయకుండా పాఠశాల యాజమాన్యాలు అవగాహన కల్పించాలన్నారు. 

News March 31, 2025

అవనిగడ్డ: హైవేపై రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి

image

అవనిగడ్డ మండల పరిధిలోని 216 జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పులిగడ్డ సమీపంలోని టోల్ ప్లాజా వద్ద ఎదురుగా వస్తున్న లారీ కారును ఢీ కొట్టింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తెనాలి వైపు నుంచి మోపిదేవికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. అవనిగడ్డ సీఐ, ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!