News February 18, 2025
కృష్ణా: డిగ్రీ పరీక్షల టైం టేబుల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో బీఏ(మల్టీమీడియా) కోర్స్ విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1, 3, 4,5 తేదీలలో ఈ పరీక్షలు జరుగుతాయని ANU పరీక్షల విభాగ కంట్రోలర్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడాలని సూచించారు.
Similar News
News February 21, 2025
మచిలీపట్నం: APK ఫైల్ క్లిక్ చేస్తే.. ఖాతా ఖాళీ.!

ఆన్లైన్‌లో అనుమానాస్పద APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేసి ఓపెన్ చేస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ కావొచ్చు అని ఎస్పీ ఆర్. గంగాధరరావు హెచ్చరించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అపరిచిత లింకులు, అనధికారిక యాప్‌ల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు.
News February 20, 2025
కృష్ణా: డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల పరిశీలన

డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులతో సిద్ధం చేయాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన SPతో కలిసి కేంద్రాలను పరిశీలించారు. MLC ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఫిబ్రవరి 27న నిర్వహించే పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సామాగ్రి పంపిణీకి మచిలీపట్నం నోబుల్ కాలేజ్, ఉయ్యూరు, గుడివాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయాల పరిధిలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
News February 20, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

1. MLC ఓటు చెక్ చేసుకోండి ఇలా. 2. గన్నవరం: బాలికల మిస్సింగ్.. ఛేదించిన పోలీసులు3. మచిలీపట్నం బ్యాంకులో దొంగతనం4. మచిలీపట్నం: ఉద్యోగం నుంచి ప్రిన్సిపల్ తొలగింపు5. గుడివాడ: విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి 6. M.Tech 1st సెమిస్టర్ టైం టేబుల్ విడుదల 7. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో వంశీకి షాక్8. జిల్లా వ్యాప్తంగా MLC ఎన్నికల ప్రచారం9. డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల పరిశీలన