News November 11, 2024

కృష్ణా: డిగ్రీ వన్ టైం ఆపర్చ్యునిటీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ(2010-11 నుంచి 2014-15 అకడమిక్ ఇయర్) వన్ టైం ఆపర్చ్యూనిటీ థియరీ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా ఈ నెల 25లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు డిసెంబర్ 30 నుంచినిర్వహిస్తామని, ఫీజు వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని KRU పరీక్షల విభాగం తెలిపింది. 

Similar News

News November 25, 2024

మండవల్లి: ‘ఆస్తి కోసం తమ్ముడిని హత్య చేశాడు’

image

మండవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గన్నవరం గ్రామంలో జరిగిన జంట హత్యల కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో రోయ్యూరు నగేశ్ బాబు అనే నిందితుడు తన తమ్ముడు రోయ్యూరు సురేశ్, అత్త భ్రమరాంభను కత్తితో దారుణంగా హత్యచేశాడని తెలిపారు. ఈ కేసులో 48 గంటలలో నిందితులను అరెస్ట్ చేసిన కైకలూరు సీఐ రవికుమార్‌ను, ఎస్ఐను డీఎస్పీ అభినందించారు.

News November 25, 2024

కృష్ణా: రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో జూన్ 2024లో నిర్వహించిన బీపీఈడీ 2వ సెమిస్టర్ పరీక్షలకు(2023- 24 విద్యా సంవత్సరం) సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 29లోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.900 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపుకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.

News November 25, 2024

ఉమ్మడి కృష్ణాలో భారీ వర్షం కురిసే అవకాశాలు: APSDMA

image

హిందూ మహాసముద్రంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలపడిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) MD రోణంకి కూర్మనాథ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇది పశ్చిమ- వాయువ్య దిశగా కదిలి సోమవారం దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగాలపై వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో నవంబర్ 27 నుంచి 30 మధ్య ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని కూర్మనాథ్ చెప్పారు.