News December 3, 2024

కృష్ణా: డిగ్రీ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులు(2023 – 24 విద్యా సంవత్సరం) రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ విడుదలైంది. డిసెంబర్ 18 – 2025 జనవరి 3 మధ్య నిర్ణీత తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. సబ్జెక్టువారీగా పరీక్షల టైం టేబుల్ వివరాలకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని KRU సూచించింది.

Similar News

News December 4, 2024

కృష్ణా: బీ-ఫార్మసీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో బీ-ఫార్మసీ కోర్సు(Y17 నుంచి Y23 బ్యాచ్‌లు) చదివే విద్యార్థులు రాయాల్సిన 3వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ థియరీ పరీక్షలను 2025 జనవరి 28 నుండి నిర్వహిస్తామని వర్శిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 13లోపు అపరాధరుసుము లేకుండా ఫీజు చెల్లించాలని, పూర్తి వివరాలకు https://kru.ac.in అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని కోరింది.

News December 4, 2024

బ్లేడ్‌తో భర్త గొంతు కోసి చంపిన భార్య.. అనుమానాలే కారణం

image

భర్త గొంతు కోసం భార్య <<14781158>>హతమార్చిన<<>> ఘటన నిన్న గుడివాడలో జరిగిన సంగతి తెలిసిందే. భార్యభర్తల మధ్య అనుమానపు విభేదాలే హత్యకు కారణంగా తెలిసింది. రైలుపేటకు చెందిన చిన్న, జ్యోతిలు ఐదు చోరీ కేసుల్లో నిందితులగా ఉన్నారు. విభేదాలు తలెత్తి ప్రస్తుతం విడిగా ఉంటున్నారు. నిన్న జ్యోతి ఇంటికి రాగా ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో బ్లేడ్‌తో భర్త పీక కోసి చంపింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు ఉన్నారు.

News December 4, 2024

ఉమ్మడి కృష్ణా జిల్లాలో భూప్రకంపనలు

image

తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు రాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనూ కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. నూజివీడులోని కోనేరుపేటలో భూప్రకంపనలు వచ్చాయి. నిమిషం పాటు భూమి కంపించడంతో ఇల్లు మొత్తం కదిలి, సామాను చిందర వందర అయినట్లు స్థానికురాలు మస్తాన్ బీ  Way2Newsతో చెప్పారు. ఇటు VJA, గుడివాడ, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెంలోనూ భూకంపం వచ్చింది.