News November 3, 2025

కృష్ణా: డిసెంబర్‌లో జాతీయ లోక్‌ అదాలత్‌.!

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో డిసెంబర్ 18న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా జడ్జి గోపి తెలిపారు. లోక్ అదాలత్ కోసం జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కక్షిదారులు రాజీపడే అన్ని కేసులను పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని ఇరు పార్టీల కక్షిదారులు తమ న్యాయవాదులతో సంప్రదించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.

Similar News

News November 3, 2025

మరో 6 నెలలు కాల్పుల విరమణ: మావోయిస్టు పార్టీ

image

TG: రాష్ట్రంలో శాంతియుత వాతావరణం కొనసాగాలని తెలంగాణ సమాజం కోరుకుంటోందని మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ పేర్కొంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గత మే నెలలో ప్రకటించిన కాల్పుల విరమణను మరో ఆరు నెలలు కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర శాఖ అధికార ప్రతినిధి జగన్ పేరిట ప్రకటన విడుదల చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని శాంతియుత వాతావరణానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తోందని ఆరోపించింది.

News November 3, 2025

మేడ్చల్: ప్రజావాణిలో 105 ఫిర్యాదుల స్వీకరణ

image

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి డీఆర్ఓ హరిప్రియతో కలిసి అదనపు కలెక్టర్ 105 దరఖాస్తులను స్వీకరించారు.

News November 3, 2025

మేడ్చల్: నూతన రేషన్ కార్డులు.. బియ్యం పంపిణీ..!

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఉప్పల్, నాచారం, హబ్సిగూడ సహా అనేక ప్రాంతాల్లో నూతనంగా రేషన్ కార్డులు మంజూరైన వారికి ఈనెల రేషన్ దుకాణాల్లో రేషన్ బియ్యం, సరకులు పంపిణీ చేస్తున్నట్లు డీలర్లు తెలిపారు. మీసేవ అప్లికేషన్ నంబర్ ఉపయోగించి, నెట్ సెంటర్‌లో మీ దరఖాస్తు స్టేటస్ చెక్ చేసుకోవాలని, ఒకవేళ రేషన్ కార్డు మంజూరైతే, రేషన్ బియ్యం కోసం రావాలని సూచించారు.