News May 24, 2024
కృష్ణా: తమిళనాడుకు ప్రత్యేక రైళ్లు నడపనున్న రైల్వే

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా నాగర్‌కోయిల్ (NCJ), డిబ్రుగర్ (DBRG) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం. 06105 NCJ- DBRG రైలును జూన్ 14,21,28 తేదీలలో, నం.06106 DBRG- NCJ రైలును జూన్ 19, 26, జులై 3వ తేదీలలో నడుపుతామని తెలిపారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు ఏలూరు, రాజమండ్రి, విజయనగరం తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు చెప్పారు.
Similar News
News April 23, 2025
కాస్త మెరుగుపడ్డ కృష్ణా జిల్లా స్థానం

పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో కృష్ణాజిల్లా స్థానం కొంతలో కొంత మెరుగుపడింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో 85.32% ఉత్తీర్ణతతో జిల్లా 10వ స్థానంలో నిలిచింది. గత రెండు సంవత్సరాలుగా జిల్లా 11వ స్థానానికి పరిమితమవుతూ వచ్చింది. 2022-23లో 74.67%, 2023-24 సంవత్సరంలో 90.05% ఉత్తీర్ణతతో 11వ స్థానంలో నిలిచింది. కాగా ఈ ఏడాది 20,776 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 17,726 మంది ఉత్తీర్ణులయ్యారు.
News April 23, 2025
10th RESULTS: 10వ స్థానంలో కృష్ణా జిల్లా

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కృష్ణా జిల్లా 85.32%తో రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచింది. మొత్తం 20,776 మంది పరీక్షలు రాయగా 17,726 మంది పాసయ్యారు. 10,783 బాలురులో 8,998 మంది, 9,993 మంది బాలికలు పరీక్ష రాయగా 8,728 మంది పాసయ్యారు.
News April 23, 2025
స్పా సెంటర్‌పై పోలీసుల దాడి.. విజయవాడకు చెందిన ఇద్దరు అరెస్ట్

వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో రాజమండ్రిలోని ఓ స్పా సెంటర్‌పై అక్కడి పోలీసులు మంగళవారం దాడి చేశారు. సీఐ మురళీకృష్ణ తెలిపిన సమాచారం ప్రకారం.. విజయవాడకు చెందిన మదన్, తేజస్విలు అన్నా చెల్లెలు. వీరు విజయవాడ నుంచి వెళ్లి రాజమండ్రిలో స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు. బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తామని యువతులకు ఎరవేసి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఐదుగురు యువతులు, విటులను పట్టుకున్నారు.