News January 12, 2026
కృష్ణా: తల్లి గల్ఫ్‌లో.. కన్నబిడ్డపై కన్నేసిన తండ్రి!

కన్న కూతురిపై తండ్రి అసభ్యంగా ప్రవర్తించిన అమానుష ఘటన కృత్తివెన్నులో చోటుచేసుకుంది. తల్లి గల్ఫ్‌లో ఉండటంతో, 14 ఏళ్ల బాలిక ప. గో (D) మొగల్తూరులోని అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటోంది. అక్కడ తండ్రి వేధింపులకు పాల్పడటంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మొగల్తూరు పోలీసులు జీరో FIR నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కోసం కేసును కృత్తివెన్ను పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
Similar News
News February 5, 2026
అనంత: బాలికను గర్భవతిని చేసిన ఆటో డ్రైవర్!

మాయమాటలు చెప్పి ఇంటర్ చదువుతున్న అమ్మాయిని గర్భవతిని చేశాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన గుత్తిలో చోటుచేసుకుంది. బ్రాహ్మణపల్లికి చెందిన ఆటో డ్రైవర్ ఓబుళపతి విద్యార్థిని తన ఆటోలో రోజూ అనంతపురం రోడ్డులో ఉన్న కళాశాలకు తీసుకెళ్లేవాడు. వారి మధ్య పరిచయం పెరిగి, లైంగిక వాంఛ తీర్చుకునేవాడు. ఈ క్రమంలో ఆమె 6 నెలలు గర్భవతి అని తేలింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆటో డ్రైవర్‌ను ఎస్సై సురేశ్ అదుపులోకి తీసుకున్నారు.
News February 5, 2026
కృష్ణా: రైలు ప్రయాణికులకు GOOD NEWS

ప్రయాణికుల రద్దీ మేర ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా అనకాపల్లి(AKP)-సికింద్రాబాద్(SC) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు బుధవారం తెలిపారు. నం.07041 SC-AKP రైలు ఈ నెల 22న, నం.07042 AKP-SC రైలు 23న నడుపుతున్నామన్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ AC, స్లీపర్, జనరల్ కోచ్‌లతో నడిచే ఈ రైళ్లు ఉమ్మడి కృష్ణాలో విజయవాడ, గుడివాడ, కైకలూరులో ఆగుతాయని వెల్లడించారు.
News February 5, 2026
సాగునీటి సంఘాల ఛైర్మన్లతో నేడు సీఎం భేటీ

AP: అమరావతి పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఇవాళ సాగునీటి సదస్సు జరగనుంది. రాష్ట్రంలోని 6,047 సంఘాలు, 58 ప్రాజెక్టు కమిటీలు, 267 డిస్ట్రిబ్యూటరీ కమిటీల ఛైర్మన్లు హాజరుకానున్నారు. వారినుద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. ప్రాజెక్టుల యాజమాన్య నిర్వహణ, గ్రామ, మండల, జిల్లా పరిషత్ సమావేశాలకు సాగునీటి సంఘాల ఛైర్మన్లను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవడంపై సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది.


