News April 10, 2024
కృష్ణా: తిరుపతి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త

ప్రయాణికుల రద్దీ మేరకు మచిలీపట్నం(MTM), తిరుపతి(TPTY) మధ్య స్పెషల్ రైళ్లను నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. నెం.07121 TPTY- MTM మధ్య నడిచే రైలును ఈ నెల 14 నుంచి మే 26 వరకు ప్రతి ఆదివారం, నెం.07122 MTM- TPTY మధ్య నడిచే రైలును ఈ నెల 15 నుంచి మే 27 వరకు ప్రతి సోమవారం నడుపుతామన్నారు. ఈ రైళ్లు ఉమ్మడి జిల్లాలో విజయవాడ, పెడన, గుడివాడ స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు.
Similar News
News July 7, 2025
నేడు ఆత్కూర్ స్వర్ణ భారత్ ట్రస్ట్‌కు కలెక్టర్

ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్టులో ఈనెల 10న వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ హాజరు కానున్నారు. ఆయన పర్యటనను దృష్టిలో పెట్టుకొని భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం ట్రస్టును సందర్శించనున్నారు.
News July 7, 2025
మచిలీపట్నంలో నేడు మీకోసం కార్యక్రమం

ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ‘మీకోసం’ కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ చెప్పారు. తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రజానీకం, సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులకు అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వివినియోగం చేసుకోవాలని కోరారు.
News July 6, 2025
వీరపనేనిగూడెంలో ప్రమాదం.. ఒకరి మృతి

గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో తెంపల్లికి చెందిన షేక్ యూసఫ్ బాషా (28) మృతి చెందాడు. తాపీ పని ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా, ఇటుకబట్టీల వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. సమాచారం అందుకున్న ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.