News January 31, 2026

కృష్ణా: థైరాయిడ్ పరీక్ష చేసే యంత్రం పనిచేయక రెండేళ్లు.!

image

మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం నిరుపేదలకు శాపంగా మారింది. రూ. 1.50 కోట్ల విలువైన యంత్రం ఉన్నా, రసాయనాలు లేవనే సాకుతో రెండేళ్లుగా T3, T4 పరీక్షలు నిలిపివేశారు. ఫలితంగా నిత్యం వందలాది మంది గర్భిణులు, రోగులు ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయించి రూ. 600 వరకు వెచ్చించాల్సి వస్తోంది. కేవలం ప్రాథమిక పరీక్షలకే పరిమితమైన GGH తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Similar News

News February 21, 2026

రేపు గురుకుల ఎంట్రన్స్ పరీక్ష

image

TG: గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం రేపు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TGసెట్) జరగనుంది. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 492 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. 11AM నుంచి 1PM వరకు ఎగ్జామ్ జరుగుతుందని చెప్పారు. కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని, పరీక్ష ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత లోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు.

News February 21, 2026

NGKL: నల్లమల్లలో అరుదైన ‘నక్షత్రపు తాబేలు’ గుర్తింపు.!

image

నల్లమల్ల అటవీ ప్రాంతంలో అత్యంత అరుదైన నక్షత్రపు తాబేలు శుక్రవారం వెలుగుచూసింది. అడవిలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాల నేపథ్యంలో వన్యప్రాణులు రోడ్లపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఐటీడీఏ మెడికల్ ఆఫీసర్ కళ్యాణ్ సాగర్, బ్రహ్మగిరి నుంచి అచ్చంపేట వస్తుండగా రోడ్డుపై భారీ పరిమాణంలో ఉన్న ఈ తాబేలును గుర్తించారు. ఇంత పెద్ద పరిమాణంలో ఉన్న తాబేలును అధికారులు అధికారికంగా గుర్తించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

News February 21, 2026

నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసెఫ్

image

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసెఫ్ నియమితులైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గత జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఉద్యోగులు, సిబ్బంది రవి జోసెఫ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.