News November 25, 2025
కృష్ణా: నాడు నేడు పనులు పూర్తి చేస్తే బాగు.!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాడు-నేడు పథకం కింద 80 నుంచి 90% వరకు పూర్తయిన పనులు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు లేక అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లాలో 175, కృష్ణా జిల్లాలో 100 పైగా పాఠశాలల్లో అదనపు గదులు, మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. సుమారు 600 పైగా స్కూళ్లలో పెయింటింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News November 25, 2025
పెద్దపల్లిలో షీ టీమ్ అవగాహన కార్యక్రమం

RGM సీపీ ఆదేశాలపై PDPLలోని ఒక కాలేజీలో పెద్దపల్లి షీ టీమ్ అవగాహన సదస్సు నిర్వహించింది. ఇన్‌ఛార్జ్ SI లావణ్య మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్‌పై విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. వేధింపులపై 6303923700, సైబర్ మోసాలపై 1930, అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేయాలన్నారు. బస్టాండ్, ప్రధాన చౌరస్తాల్లో రెగ్యులర్ పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
News November 25, 2025
పెండింగ్ దరఖాస్తులు వెంటనే సమర్పించండి: కలెక్టర్

PDPL కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయని ఎస్సీ విద్యార్థులను గుర్తించి వెంటనే https://telanganaepass.cgg.gov.in ద్వారా దరఖాస్తులు DEC 31లోపు సమర్పించాలని సూచించారు. దరఖాస్తుల హార్డ్ కాపీలు, బయోమెట్రిక్ అథెంటికేషన్‌ను పూర్తిచేసి SC అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
News November 25, 2025
పెగడపల్లి: 10,853 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

పెగడపల్లి మండలంలో వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3.50 లక్షల మహిళా సంఘాలకు రూ.304 కోట్లు, జగిత్యాలలో 11,825 సంఘాలకు రూ.10.69 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు 10,853 ఇళ్లు మంజూరై అర్హులకు రూ.5 లక్షలు అందిస్తున్నామని చెప్పారు.


