News November 15, 2025

కృష్ణా: నిందితుడితో టిఫిన్ చేసిన నలుగురు పోలీస్ సిబ్బంది సస్పెండ్

image

YCP సోషల్ మీడియా కార్యకర్త, NRI విజయ భాస్కర రెడ్డి అరెస్ట్ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ నెల 13న భాస్కర రెడ్డిని కోర్టు అనుమతితో స్వగ్రామం తీసుకువెళుతుండగా ఎస్కార్ట్ సిబ్బంది ఇద్దరు, పెనమలూరు PSకు చెందిన ASI, మరో కానిస్టేబుల్ నిందితుడితో కలిసి ఓ హోటల్‌లో టిఫిన్ చేయడంతో వారిని SP సస్పెండ్ చేశారు. ASI సస్పెన్షన్‌పై SP ఏలూరు రేంజ్ IGకి రిపోర్ట్ పంపారు.

Similar News

News November 15, 2025

ఖమ్మం: వ్యక్తి మృతి.. అకౌంట్ నుంచి డబ్బు మాయం

image

చనిపోయిన వ్యక్తి ఖాతా నుంచి ఫోన్‌పే ద్వారా పలు దఫాలుగా నగదు కాజేసిన ఘటన సత్తుపల్లిలో జరిగింది. హనుమాన్ నగర్‌కు చెందిన ఆలేటి ప్రసాద్ 3 నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ప్రసాద్‌ ఫోన్ నుంచి ఫోన్ పే ద్వారా కొందరు దుండగులు రూ.3 లక్షలు కాజేశారు. కుటుంబ సభ్యులకు బ్యాంకుకు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేయగా.. అకౌంట్‌లో ఉన్న నగదు మొత్తం బదిలీ అయిందని చెప్పడంతో షాక్ అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 15, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* విశాఖ CII సదస్సులో WEF సెంటర్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
* పరకామణి కేసు ఫిర్యాదుదారు సతీశ్ మృతిపై దర్యాప్తు ముమ్మరం.. అనంతపురం చేరుకున్న సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్
* గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ఏపీ అవతరిస్తోందన్న మంత్రి గొట్టిపాటి
* చంద్రబాబుపై నమ్మకం లేక కంపెనీలు పెట్టుబడుల్ని భారీగా తగ్గిస్తున్నాయని YCP విమర్శలు

News November 15, 2025

‘సజ్జనార్’ పేరుతోనే ఫ్రెండ్‌ను మోసగించిన సైబర్ నేరగాళ్లు!

image

సైబర్ నేరాలపై అవగాహన కల్పించే హైదరాబాద్ CP సజ్జనార్‌ మిత్రుడికి కేటుగాళ్లు షాక్ ఇచ్చారు. ఆయన పేరుతో ఫేక్ FB అకౌంట్ క్రియేట్ చేసి ఆపదలో ఉన్నానంటూ డబ్బులు పంపాలని మెసేజ్‌లు పంపారు. దీంతో ఇది నిజమే అనుకొని తన స్నేహితుడు రూ.20వేలు పంపించి మోస పోయారని సజ్జనార్ ట్వీట్ చేశారు. ‘నా పేరుతో, లేదా ఏ అధికారి/ ప్రముఖ‌ వ్యక్తి పేరుతో ఫేస్‌బుక్‌లో డబ్బులు పంపాలని వచ్చే సందేశాలను అసలు నమ్మకండి’ అని ఆయన సూచించారు.