News January 6, 2025

కృష్ణా: ‘నిధుల విడుదలకు కార్యాచరణ సిద్ధం చేయండి’

image

కేంద్ర ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సత్వరమే నిధుల విడుదలకు కార్యాచరణ సిద్ధం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం జిల్లాల్లో అమలు చేస్తున్న పథకాల వారీగా, జిల్లాలో వాటిని అమలు చేసే శాఖల వారీగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేయాలన్నారు.

Similar News

News April 25, 2025

మోపిదేవి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

కృష్ణా జిల్లా మోపిదేవి వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు.. అవనిగడ్డకు చెందిన యాసాబాల భాస్కర్ (21), బంతుల సుధాకర్ (18) చల్లపల్లి వెళ్తుండగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

News April 25, 2025

విజయవాడ: ఒకే జైలులో నలుగురు నిందితులు

image

విజయవాడ జిల్లా జైలులో కీలకమైన కేసులలో నిందితులుగా ఉన్న నలుగురు ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. సత్యవర్ధన్ అనే యువకుడి కిడ్నాప్ కేసులో మాజీ MLA వంశీ, జత్వాని కేసులో రిమాండ్ విధింపబడటంతో ఇంటెలిజెన్స్ విభాగ మాజీ అధిపతి PSR ఆంజనేయులు రిమాండ్ ఖైదీలుగా ఉండగా.. లిక్కర్ కుంభకోణం కేసులో రాజ్ కెసిరెడ్డి, ఇదే కుంభకోణంలో A8గా ఉన్న చాణక్యకు న్యాయస్థానం రిమాండ్ విధించడంతో పోలీసులు ఇదే జైలుకు తరలించారు.

News April 24, 2025

మైలవరం: బాలికపై లైంగిక దాడి.. పోక్సో కేసు నమోదు

image

మైలవరానికి చెందిన యువకుడు అవినాశ్ తెనాలిలో ఏడవ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తెనాలి వన్ టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఓ ప్రైవేటు స్కూల్లో 7వ తరగతి చదువుతున్న బాలికకు అవినాశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. ఇటీవల తెనాలి వచ్చిన అతడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు ఆరా తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

error: Content is protected !!