News April 10, 2025
కృష్ణా: నియోజకవర్గానికి ఒక MSME పార్క్ ఏర్పాటు- కలెక్టర్

కృష్ణా జిల్లాలో నియోజకవర్గానికి ఒక MSME పార్క్ నెలకొల్పుటకు అనువైన స్థలాలను గుర్తించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో రెవెన్యూ డివిజనల్ అధికారులతో సమావేశమైన కలెక్టర్ MSME పార్కుల ఏర్పాటుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో విరివిగా పరిశ్రమలు నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు.
Similar News
News April 18, 2025
మసులా బీచ్ వేదికగా మేలో నేషనల్ వాటర్ స్పోర్ట్స్ పోటీలు

నేషనల్ వాటర్ స్పోర్ట్స్‌కు మసులా బీచ్ వేదిక కాబోతుంది. మే 15 నుంచి నిర్వహించే బీచ్ ఫెస్టివల్‌లో ఈ పోటీలు మిలితం కానున్నాయి. బీచ్ కబడ్డీతో పాటు SEA KAYA KING పోటీలను మసులా బీచ్ (మంగినపూడి బీచ్) లో నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పోటీలకు సుమారు 10 నుంచి 15 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు తరలి రానున్నారు. వీరికి ఆతిథ్యం ఇచ్చేందుకు మచిలీపట్నం సిద్ధమవుతోంది.
News April 18, 2025
VJA: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

విజయవాడ అజిత్ సింగ్ నగర్‌లోని ఇంద్రనాయక్ నగర్‌లో గురువారం సాయంత్రం వ్యభిచారం నిర్వహిస్తున్న ఒక ఇంటిపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. టాస్క్‌ఫోర్స్, సింగ్ నగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడిలో ఇద్దరు విటులు, ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
News April 18, 2025
కృష్ణా: ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళను కలిసిన ఏఎంసీ నూతన ఛైర్మన్

రాష్ట్ర ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావును అవనిగడ్డ ఏఎంసీ నూతన ఛైర్మన్‌గా నియమితులైన కొల్లూరి వెంకటేశ్వరరావు కలిశారు. గురువారం మచిలీపట్నంలో ఆయనను కలిసి దివి మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపి, సత్కరించారు. పార్టీ అప్పగించిన బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వహించి పదవికి వన్నె తేవాలని ఏఎంసీ ఛైర్మన్‌కు నారాయణరావు సూచించారు.