News September 22, 2025

కృష్ణా: నేడు బాలా త్రిపుర సుందరిగా దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ

image

శరన్నవరాత్రులలో తొలి రోజైన నేడు సోమవారం బాలా త్రిపురసుందరి దేవిగా విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం బాలాత్రిపురసుందరీదేవి అని, ఈ తల్లిని ఆరాధిస్తే మనోవికారాలు తొలగుతాయని, సర్వ సంపదలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. మహిమాన్వితమైన శ్రీ బాలా మంత్రం సమస్త దేవీమంత్రాల్లోకెల్లా అత్యున్నతమైనదని ఉపాసకులు చెబుతారు.

Similar News

News September 22, 2025

కారణం లేకుండా మాపైకి రావడంతో దీటుగా బదులిచ్చా: అభిషేక్

image

ASIA CUP: నిన్నటి భారత్, పాక్ మ్యాచ్‌ సందర్భంగా అభిషేక్ శర్మ- రౌఫ్, అఫ్రీది మధ్య హీటెడ్ డిస్కషన్ జరిగింది. వీటిపై అభిషేక్ స్పందిస్తూ.. ‘కారణం లేకుండా పాక్ ప్లేయర్లు మాపైకి వచ్చారు. అది నాకు నచ్చలేదు. అందుకే వారికి దీటుగా బదులిచ్చా. జట్టు విజయం కోసం పోరాడా’ అని చెప్పారు. గిల్‌తో భాగస్వామ్యంపై మాట్లాడుతూ.. ‘ఇద్దరం స్కూల్ డేస్ నుంచి కలిసి ఆడుతున్నాం. ఒకరి ఆటను మరొకరం గౌరవిస్తాం’ అని చెప్పారు.

News September 22, 2025

గుంటూరు: హాస్టల్‌లో యువతి అనుమానాస్పద మృతి

image

గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్‌నగర్‌లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. స్థానికంగా ఒక హాస్టల్‌లో ఉంటున్న ఆమె, తన ముఖానికి ప్లాస్టర్ వేసి నిర్జీవంగా పడి ఉండటంతో సహచర విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 22, 2025

వనపర్తి: రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

వనపర్తి జిల్లాలో ఇటీవల విద్యుత్ ప్రమాదాల్లో 11 మంది రైతులు చనిపోయిన నేపథ్యంలో, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. తడి నేలల్లో విద్యుత్ మోటార్లను ఆన్, ఆఫ్ చేయకుండా జాగ్రత్త వహించాలన్నారు. విద్యుత్ లైన్లలో ఏమైనా లోపాలు కనిపిస్తే వెంటనే లైన్‌మెన్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రమాదాలు జరగకుండా రైతులు రబ్బరు చెప్పులు ధరించాలని ఎస్పీ కోరారు.