News March 17, 2025
కృష్ణా: నేడు ‘మీకోసం’ కార్యక్రమం

ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ‘మీకోసం’ కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ బాలాజీ ఒక ప్రకటన విడుదల చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రజానీకం, సోమవారం జరిగే ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులకు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్ సూచించారు.
Similar News
News September 11, 2025
కృష్ణా: ఒకేసారి 15 మందికి గవర్నమెంట్ జాబ్స్

కోడూరు మండలం జరుగువానిపాలెం గ్రామం ఆదర్శంగా నిలిచింది. చిన్న పల్లెటూరు నుంచి ఒకేసారి 15 మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారిలో 8 మంది అమ్మాయిలు, 7 మంది అబ్బాయిలు. ఇటీవల విడుదలైన డీఎస్సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో వీరు అర్హత సాధించారు. 11 టీచర్ పోస్టులు, 3 పోలీస్ ఉద్యోగాలు, ఒకరు సేల్స్ ట్యాక్స్‌లో నియామకం పొందారు.
News September 11, 2025
గరికపాడులో జిల్లా జూడో జట్ల ఎంపిక

తోట్లవల్లూరు మండలం గరికపాడు ప్రభుత్వ పాఠశాలలో అండర్-14, 17 జూడో జట్ల ఎంపికలు ఘనంగా జరిగాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ ఎంపికలు నిర్వహించినట్లు జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శులు దుర్గారావు, శ్రీలత తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు కీర్తి తీసుకురావాలని వారు క్రీడాకారులను కోరారు.
News September 11, 2025
మచిలీపట్నం-విజయవాడ రహదారిపై ప్రమాదం.. స్పాట్ డెడ్

మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని వెంటనే 108 అంబులెన్స్‌లో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.