News December 18, 2024
కృష్ణా: పలు రైళ్లను దారి మళ్లించిన రైల్వే అధికారులు

గుంతకల్లు డివిజన్‌లో ట్రాక్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా నడిచే పూరి(PURI)- యశ్వంత్‌పూర్(YPR) గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లను రైల్వే అధికారులు దారి మళ్లించారు. ఈ మేరకు నం.22883 PURI- YPR రైలు ఈ నెల 20న, నం.22884 YPR- PURI రైలు ఈ నెల 21న నంద్యాల- డోన్ మీదుగా కాక నంద్యాల- ఎర్రగుంట్ల- గుత్తి మీదుగా అనంతపూర్ వెళుతుందన్నారు. ఈ తేదీల్లో పై 2 రైళ్లు డోన్‌లో ఆగవని మంగళవారం తెలిపారు.
Similar News
News February 27, 2026
డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలోనే లేదు: కృష్ణా ఎస్పీ

న్యాయవ్యవస్థలో డిజిటల్ అరెస్ట్ అనే పదమే లేదని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం
ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఆయన.. ఇటీవల సైబర్ నేరగాళ్ల చెర నుంచి పోలీసుల సాయంతో బయటపడ్డ వృద్ధ దంపతులను అభినందించారు. జిల్లావ్యాప్తంగా దీనిపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, ఇలాంటి సంఘటనలు ఎదురైతే భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని ఎస్పీ సూచించారు.
News February 27, 2026
ఉయ్యూరులో నేడు జాబ్ మేళా

ఉయ్యూరు AGSGS కళాశాలలో శుక్రవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శివనాథ్ వెల్లడించారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు పూర్తి చేసిన అభ్యర్థులు, బీఎస్సీ కెమిస్ట్రీ, ఫార్మసీ విద్యార్థులు, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారు పాల్గొనవచ్చన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న యువత విద్యార్హత ధ్రువపత్రాలతో కళాశాల ప్రాంగణంలో హాజరుకావాలని కోరారు.
News February 27, 2026
బాపులపాడు డిప్యూటీ ఎంపీడీఓపై సస్పెన్షన్ వేటు

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాపులపాడు మండల డిప్యూటీ ఎంపీడీఓ లక్ష్మయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. లక్ష్మయ్యను సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. పన్ను వసూళ్లలో పురోగతి సాధించకపోవడం, సమీక్షా సమావేశాలకు గైర్హాజరు అవుతుండటం, OHSR ట్యాంక్‌లను పరిశుభ్రపర్చడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డిప్యూటీ ఎంపీడీఓను సస్పెండ్ చేశారు.


