News April 22, 2025
కృష్ణా : పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పటిష్ఠ ఏర్పాట్లు – DRO

కృష్ణా జిల్లాలో ఈ నెల 30వ తేదీన జరగనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై సోమవారం తన ఛాంబర్‌లో అధికారులతో ఆయన సమీక్షించారు.10 పరీక్షా కేంద్రాల్లో 4546 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు.
Similar News
News April 22, 2025
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

పెనమలూరు మండలం పెద్దపులిపాకలో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ రాజేష్ (29) విజయవాడ ఆటోనగర్లో వెల్డింగ్ పని చేసేవాడు. కొంతకాలం నుంచి మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో పెదపులిపాకలోని తన ఇంట్లో సోమవారం సాయంత్రం రాజేశ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 22, 2025
కృష్ణా : ‘కోర్టు కేసుల్లో నిర్లక్ష్యం తగదు’

కోర్టు కేసులకు సంబంధించి వకాలత్, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమానికి ముందుగా జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై సమీక్షించారు.
News April 21, 2025
కృష్ణా: ట్రై సైకిల్ పంపిణీ చేసిన కలెక్టర్

సమాజంలో ఇతరుల మాదిరిగానే విభిన్న ప్రతిభావంతులు చాలా గర్వంగా బ్రతకాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్లో పాఠశాల విద్య – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో కలెక్టర్ దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను ఉచితంగా పంపిణీ చేశారు.