News February 25, 2026
కృష్ణా: పునర్వికకు రూ.6కోట్లు సాయం ప్రకటించిన మంత్రి లోకేశ్

కర్నూలుకు చెందిన చిన్నారి పునర్విక అరుదైన వ్యాధితో పోరాడుతోంది. పాప ప్రాణాలు నిలపాల్సిన ఇంజెక్షన్ ఖరీదు రూ.16 కోట్లు కాగా, దాతల సాయంతో ఇప్పటికే రూ.10 కోట్లు సమకూరాయి. మిగిలిన రూ.6 కోట్లను తాను ఏర్పాటు చేస్తానని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. చిన్నారి ప్రాణాలు నిలబెట్టేందుకు దాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News February 27, 2026
HYD: Gen Z తెలివి.. ‘చెత్త’ నుంచి డబ్బు!

HYD యువతలో ఇప్పుడు ‘అప్‌సైక్లింగ్’ ఒక మతంలా మారుతోంది. మురికివాడల్లో పారేసిన టైర్లు, విరిగిన ప్లాస్టిక్ డబ్బాలను సేకరించి వాటిని లగ్జరీ ఫర్నీచర్‌గా మార్చి ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. ఇది కేవలం వ్యాపారం కాదు.. పర్యావరణం మీద వారికున్న ‘యూనిక్’ ప్రేమ. పాత సామన్ల మార్కెట్ (జుమ్మెరాత్ బజార్) వీరి పాలిట ఇప్పుడు ఒక ఐడియా బ్యాంక్. వ్యర్థాలను అర్థాలుగా మార్చుతున్న ఈ Gen Z తెలివితేటలు అమోఘం.
News February 27, 2026
చెరువుల పరిరక్షణపై అధికారులకు కలెక్టర్ ఆదేశం..!!

నిర్మల్ జిల్లాలోని చెరువులను పకడ్బందీగా పరిరక్షించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమీక్ష నిర్వహించారు. చెరువు గట్లను బలోపేతం చేయాలని, కబ్జాలకు గురైతే తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు జాయింట్ సర్వే చేసి సరిహద్దులు గుర్తించాలన్నారు. గట్లపై మొక్కలు పెంచాలని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ కిషోర్ పాల్గొన్నారు.