News March 7, 2025
కృష్ణా: పేర్ని నానికి హైకోర్టులో ఊరట

మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది. శుక్రవారం హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో ఏ6గా పేర్ని నాని ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల పలుమార్లు టీడీపీ నేతలు త్వరలోనే పేర్ని నాని అరెస్ట్ కాబోతున్నారని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడం ఆసక్తికి తెరలేపింది.
Similar News
News March 9, 2025
అమెరికా నుంచి వచ్చి.. విశాఖలో మృతి

అమెరికాలో స్థిరపడ్డ రోజా అనే వివాహిత విశాఖలో విగతజీవిగా మారింది. అమెరికాలో వైద్యునిగా పనిచేస్తున్న విశాఖకు చెందిన శ్రీధర్‌కు రోజాతో పరిచయం ఏర్పడింది. శ్రీధర్ నెల రోజుల క్రితం విశాఖ రాగా.. నాలుగు రోజుల క్రితం రోజా కూడా చేరుకుంది. వీరిద్దరూ హోటల్లో ఉండగా ఆమె మృతి చెందినట్లు త్రీటౌన్ పోలీసులకు శ్రీధర్ ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
News March 9, 2025
నరసరావుపేట: కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్‌డే

ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం ఉదయం10 గంటల నుంచి నిర్వహిస్తామని కలెక్టర్ పి. అరుణ్ బాబు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందన్నారు. జిల్లాలోని ప్రజలు సమస్యలను తెలియజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఫిర్యాదులు రాసి ఇచ్చేందుకు ప్రత్యేక సిబ్బంది ఉంటారన్నారు.
News March 9, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల ప్రజలు బర్డ్‌ఫ్లూ భయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. కొన్ని రోజులుగా కొత్త కేసులేవీ నమోదు కాకపోవడంతో చికెన్‌కు డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్, ఆదిలాబాద్‌లో KG స్కిన్ లెస్ చికెన్ రూ.160-180గా ఉంది. ఖమ్మంలో రూ.150-170 ధర ఉంది. అటు ఏపీలోని విజయవాడలో కేజీ రూ.200, కాకినాడలో రూ.170-190, విశాఖలో రూ.190 వరకు పలుకుతోంది. మరి మీ ఏరియాలో చికెన్ రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.