News July 14, 2024
కృష్ణా: పోలవరం ఎడమ కాల్వపై మంత్రి నిమ్మల సమీక్ష

పోలవరం ఎడమ కాల్వ స్థితిగతులపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు శనివారం సమీక్ష నిర్వహించారు. అమరావతి సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ సమీక్ష జరిపారు. ఎడమ కాల్వ ప్రస్తుత స్థితిగతులు, ఉమ్మడి కృష్ణా తదితర ప్రాంతాలకు నీటి సరఫరా తదితర అంశాలపై నిమ్మల అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు.
Similar News
News February 18, 2026
కృష్ణా: పదో తరగతి పరీక్షలపై కలెక్టర్ సమీక్ష

కృష్ణా జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్న పదో తరగతి, ఓపెన్ స్కూల్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం అధికారులతో సమీక్షించారు. విద్య, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల వద్ద వసతులు కల్పించాలని సూచించారు.
News February 18, 2026
కష్ణా: మూగబోయిన నాడు-నేడు ప్యూరిఫైర్లు

ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు శుద్ధ తాగునీటిని అందించేందుకు వైసీపీ హయాంలో అమలు చేసిన నాడు-నేడు పథకంలో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి యంత్రాలు జిల్లా వ్యాప్తంగా ఒక్కటి కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది. గతంలో ఈ యంత్రాల నిర్వహణకు ప్రభుత్వం పాఠశాలలకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. ఐనా మరమ్మతులు చేపట్టలేదని, వేసవికి మునుపే మరమ్మతులు చేసి పిల్లలకు తాగునీరు అందించాలని పేరెంట్స్ కోరుతున్నారు.
News February 17, 2026
కృష్ణాజిల్లాలో టుడే టాప్ న్యూస్

* మానవత్వం చాటుకున్న మంత్రి సత్య కుమార్
* కృష్ణా : మంత్రి ఇలకాలో లిక్కర్ పంచాయతీ
* కృష్ణా : బీటెక్ విద్యార్థి మృతి.. కుటుంబ సభ్యుల ధర్నా
* కృష్ణా జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం
* కృష్ణా : పోలీసుల వినూతన కార్యక్రమాలు
* రాజీవ్ నగర్ కాలనీలో పేకాట శిబిరంపై దాడి
* గుడివాడ: నత్త నడకన ఫ్లైఓవర్ పనులు


