News December 31, 2025
కృష్ణా: ప్రజా దర్బార్లకు క్యాన్సర్ బాధితుల తాకిడి.!

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న PGRS, ప్రజా దర్బార్లకు క్యాన్సర్ బాధితులు పోటెత్తుతున్నారు. తమకు పింఛన్ మంజూరవుతుందన్న ప్రచారంతో వారు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం NTR వైద్యసేవ ద్వారా ఉచిత చికిత్స మాత్రమే అందుబాటులో ఉందని, పెన్షన్ సదుపాయం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కీమో, రేడియేషన్ తర్వాత పనులు చేయలేకపోతున్నామని, తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.
Similar News
News January 2, 2026
విలీనంతో రంగారెడ్డి జిల్లాకు అన్యాయం: కాంగ్రెస్ MLA

మున్సిపాలిటీల విలీనంపై ఇబ్రహీంపట్నం MLA రంగారెడ్డి ఘాటుగా స్పందించారు. వీలినంతో రంగారెడ్డి జిల్లాను 3ముక్కలు చేశారని ఫైర్ అయ్యారు. ఇష్టారీతిన 27ULB’sను విలీనం చేశారని యంత్రాంగంపై విరుచుకుపడ్డారు. TGకి అత్యధికంగా ఆదాయం వచ్చేది RR నుంచేనని, అయినా జిల్లాకు అన్యాయం జరిగిందని వాపోయారు. విలీన ప్రక్రియి సక్రమంగా జరగలేదన్నారు. ఒక వార్డులో 15వేలు, ఉంటే మరోవార్డులో 40వేల ఓట్లు ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
News January 2, 2026
NTPCలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<
News January 2, 2026
చిన్నచిన్న ధర్మాలతో పాపాలెలా పోతాయి?

జనకుడితో వశిష్ఠ మహర్షి ఇలా వివరించారు.. ‘అడవిలో ఎండుగడ్డి వాము ఎంత పెద్దదైనా చిన్న నిప్పు రవ్వ దాన్ని క్షణంలో బూడిద చేస్తుంది. అలాగే యుగయుగాల పాపలు ధర్మాలనే చిన్న పుణ్య కార్యాల ముందు నిలవలేదు. భక్తితో చేసే నదీ స్నానం, దీపారాధన పాపాలను దహించివేస్తాయి. ‘నారాయణ’ అనే నామానికి ఉన్న శక్తి అపారమైనది. ఆ నామ ఉచ్ఛారణతో యమభటులే వణికిపోతారు. భగవంతుని కృపకు ఆడంబరమైన యజ్ఞాల కంటే ధర్మం మిన్న అని గ్రహించు’.


