News December 7, 2024
కృష్ణా: ప్రధాని మోదీపి కలిసిన ఏలూరు ఎంపీ

నూజివీడులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 8 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన జాబితాలో నూజివీడుకు స్థానం కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర కేబినెట్ నిర్ణయంతో జిల్లా విద్యార్థులకు విద్యావకాశాలు అందుబాటులోకి రానున్నాయని ఎంపీ పేర్కొన్నారు.
Similar News
News March 1, 2026
రేపు కలెక్టరేట్‌లో ‘మీ కోసం’: కలెక్టర్

ఈనెల 2న సోమవారం కృష్ణా జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్‌లో ఉదయం 10:30 గంటల నుంచి ‘మీ-కోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా వచ్చి వినతులు సమర్పించాలన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 1, 2026
అడ్డంకులు అధిగమించి పరిశ్రమలు నెలకొల్పాలి: కలెక్టర్

జిల్లాలో మంజూరైన పరిశ్రమల యూనిట్లను సత్వరమే నెలకొల్పేందుకు ఎదురవుతున్న అడ్డంకులను వెంటనే తొలగించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పరిశ్రమల అధికారులు, ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించి మంజూరైన 230 పరిశ్రమల యూనిట్ల పురోగతిపై యూనిట్ల వారీగా సమీక్షించారు.
News February 28, 2026
కృష్ణాజిల్లాలో 91.26% మేర పెన్షన్ల పంపిణీ

కృష్ణాజిల్లాలో తొలి రోజు 91.26% మేర పెన్షన్ల పంపిణీ జరిగిందని డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ హరి హరనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. 2,32,715 పెన్షన్లకు గాను, 2,12,375 పెన్షన్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. 92,38,80,000 మేర పెన్షన్ సొమ్మును అందజేశామన్నారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో అందజేస్తామన్నారు.


