News December 12, 2025
కృష్ణా: ప్రియుడి మృతితో యువతి సూసైడ్

సూర్యారావుపేటకు చెందిన లోహిత (22) కంకిపాడులోని పిన్ని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వారం క్రితం తను ప్రేమించిన అబ్బాయి చనిపోవడంతో, లోహిత తీవ్ర మానసిక వేదనకు గురైందని బంధువులు తెలిపారు. ఉదయం లేచేసరికి ఆమె ఉరికి వేలాడుతూ కనిపించడంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 24, 2025
ఖేల్‌రత్నకు హార్దిక్, అర్జునకు దివ్య, తేజస్వీ.. కమిటీ సిఫార్సు

హాకీ మెన్స్ టీమ్ వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్‌ను మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న అవార్డుకు సెలక్షన్ కమిటీ సిఫార్సు చేసింది. అథ్లెట్లు తేజస్వీ శంకర్, ప్రియాంక, నరేందర్ (బాక్సింగ్), విదిత్ గుజ్‌రాతీ, దివ్యా దేశ్‌ముఖ్ (చెస్), ధనుష్ శ్రీకాంత్ (డెఫ్ షూటింగ్), ప్రణతీ నాయక్ (జిమ్నాస్టిక్స్), రాజ్‌కుమార్ పాల్ (హాకీ), సుర్జీత్ (కబడ్డీ), నిర్మలా భాటి (ఖో ఖో)తోపాటు పలువురిని అర్జున అవార్డులకు రికమెండ్ చేసింది.
News December 24, 2025
పాస్టర్ల అకౌంట్లలో రూ.50 కోట్లు జమ

AP: సీఎం చంద్రబాబు హామీ మేరకు ఇవాళ పాస్టర్లకు రూ.50.10 కోట్లు గౌరవ వేతనం చెల్లించినట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. 2024 డిసెంబర్ నుంచి 2025 నవంబర్ వరకు 12 నెలలకు రూ.5వేల చొప్పున 8,427 మంది అకౌంట్లలో డబ్బులు జమ చేసినట్లు మంత్రి తెలిపారు. క్రిస్మస్‌ను పురస్కరించుకొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ, దయాగుణాన్ని ఇతరులకు పంచాలని క్రీస్తు ప్రజలకు బోధించడమే కాకుండా జీవించి చూపించారన్నారు.
News December 24, 2025
నెల్లూరు: వేళాంగిణీ మాతా చర్చ్ కోసం తమిళనాడు వరకు వెళ్లక్కర్లేదు

వేళాంగిణీ మాతా చర్చ్ అంటే అందరికీ మొదట గుర్తు వచ్చేది తమిళనాడే. కానీ ఆ మాత దర్శనం కోసం తమిళనాడు వరకు వెళ్లాల్సిన పనిలేదు. 1987వ సంవత్సరంలో వేళాంగిణి మాత చర్చిని టీపీ గుడూరు(M) కోడూరు బీచ్ వద్ద నిర్మించారు. తమిళనాడు వేళాంగిణి మాత చర్చ్ తర్వాత అంతటి విశిష్టత ఈ చర్చికి ఉంది. క్రిస్మస్, జనవరి ఫస్ట్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాలలో పెద్ద స్థాయిలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు.


