News August 30, 2024

కృష్ణా: ఫార్మ్-డీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఫార్మ్-డీ 1వ ఏడాది కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు సెప్టెంబర్ 20 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు పరీక్ష ఫీజును అపరాధ రుసుము లేకుండా సెప్టెంబర్ 9లోపు చెల్లించాలని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. పరీక్ష ఫీజు వివరాలకై అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని సూచించింది.

Similar News

News February 19, 2026

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

వసతి గృహాల్లో అంటి వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు: కృష్ణా కలెక్టర్
* ఇన్‌స్టా పరిచయం.. ఝార్ఖండ్ నుంచి బందరుకు వివాహిత
* కృష్ణాలో బెల్ట్ షాపుల జోరు.. మామూళ్ల హోరు.!
* మచిలీపట్నం: బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి
* విజయవాడ గాంధీ హిల్స్‌లో యువత వెకిలి చేష్టలు.!
* కృష్ణా : పది పరీక్షలకు 297 కేంద్రాలు.. 61 సమస్యాత్మక కేంద్రాలు

News February 19, 2026

వసతి గృహాల్లో అంటు వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్

image

సంక్షేమ వసతి గృహాల్లో అంటువ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన గురువారం కలెక్టరేట్‌లో అంతర్ శాఖల ఉమ్మడి తనిఖీ కమిటీ సమావేశం జరిగింది. అంటువ్యాధుల ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. వసతి గృహాలను నిరంతరం తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డా. యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

News February 19, 2026

మంగినపూడి బీచ్‌లో 24న సందడే సందడి..!

image

ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా స్థాయి సాప్ లీగ్ టోర్నమెంట్‌లో భాగంగా సైక్లింగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలు ఈనెల 24న మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద నిర్వహించనున్నారు. అండర్-18 బాలురకు 10 కి.మీ., బాలికలకు 5 కి.మీ. దూరంతో పోటీలు నిర్వహిస్తారు. పాల్గొనదలచిన క్రీడాకారులు www.sports.ap.gov.inలో ముందుగా నమోదు చేసుకోవాలని జిల్లా క్రీడా అధికారి తెలిపారు.