News September 11, 2025
కృష్ణా: ఫొటో గ్రఫీ, వీడియోగ్రఫీపై ఉచిత శిక్షణ

ఉంగుటూరు మండలం ఆత్కూర్ స్వర్ణభారత్ ట్రస్ట్‌లో 19-45 ఏళ్ల పురుషులకు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు రేషన్ ఆధార్ కార్డు కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. ఈ శిక్షణా కాలంలో ఉచిత మెటీరియల్, భోజనం వసతి సదుపాయాలు ఉంటాయని వివరించారు.
Similar News
News September 11, 2025
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మాన్ ఘీసింగ్?

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మాన్ ఘీసింగ్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. కాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని ఆ దేశ మీడియా తెలిపింది. కేపీ శర్మ ఓలీ రాజీనామా తర్వాత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి, కాఠ్‌మండూ మేయర్ బాలేంద్ర షా, విద్యుత్ అథారిటీ మాజీ చీఫ్ కుల్మాన్ ఘీసింగ్ పేర్లను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్మీకి Gen Z సూచించినట్లు తెలుస్తోంది.
News September 11, 2025
కేయూ మొదటి గేటు ఎదుట BRSV ధర్నా

గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, వెంటనే పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులను స్థానిక పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
News September 11, 2025
ఖమ్మం: KU పీజీ ఫలితాలు విడుదల

కాకతీయ యూనివర్సిటీ వివిధ పీజీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు ఎంఏ(పొలిటికల్ సైన్స్) 4వ సెమిస్టర్ మే, ఎంఏ(ఎంసీజే) మొదటి సెమిస్టర్ ఏప్రిల్, ఎంఎస్సీ(ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ) 6వ సెమిస్టర్ జూన్, ఎంఏ(ఇంగ్లిష్) మొదటి సెమిస్టర్ మార్చి-2025 ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఫలితాలను www.kuexams.org యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు.