News April 21, 2025
కృష్ణా: బాబోయ్ అడ్మిషన్‌లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్

కృష్ణా జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో అయితే టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తెస్తేనే జీతాలు ఇస్తామంటూ హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు.
Similar News
News September 8, 2025
MTM: మీకోసం కార్యక్రమంలో 42 ఫిర్యాదులు

మచిలీపట్నంలో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ఆర్. గంగాధరరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 42 ఫిర్యాదులు అందగా, ప్రతి సమస్యపై చట్టపరమైన విచారణ జరిపి తక్షణ పరిష్కారం అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. సంబంధిత పోలీస్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.
News September 8, 2025
యూరియా సరఫరాకు పటిష్ట చర్యలు: కలెక్టర్

యూరియా సరఫరాపై రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ డీకే బాలాజీ సీఎం చంద్రబాబుకు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం CM చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి వీసీలో పాల్గొన్న కలెక్టర్ బాలాజీ యూరియా సరఫరాకు జిల్లాలో చేపట్టిన చర్యలను సీఎంకు వివరించారు.
News September 8, 2025
శ్రీరామపాద క్షేత్రంలో సుందర దృశ్యం

నాగాయలంకలోని శ్రీరామపాద క్షేత్రంలో ఉన్న శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం ఇటీవల కృష్ణానది వరదలకు శివలింగం, నంది వాహనం పూర్తిగా మునిగిపోయాయి. వరదలు తగ్గుముఖం పట్టడంతో ఆదివారం ఆలయాన్ని ప్రక్షాళన చేశారు. అనంతరం భక్తుల సందర్శన కోసం సిద్ధం చేయగా, సాయం సంధ్య వేళ రంగుల వర్ణాలతో ఆలయం ప్రత్యేకంగా కనిపించింది. ఈ సుందర దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.