News June 28, 2024

కృష్ణా: బీటెక్ అకడమిక్ క్యాలెండర్ విడుదల

image

కృష్ణా వర్శిటీ పరిధిలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్ కోర్సుల అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది. నిర్ణీత పని దినాలు ఉండేలా క్యాలెండర్ తయారు చేసినట్లు వర్శిటీ పేర్కొంది. 2025 జనవరి, జూన్ నెలల్లో ఫస్టియర్ విద్యార్థులకు ఒకటి, రెండవ సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయంది. క్యాలెండర్ పూర్తి వివరాలకు కృష్ణా వర్శిటీ https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.

Similar News

News July 3, 2024

విజయవాడ: ఆదాయపు పన్ను చెల్లించడం మన కర్తవ్యం

image

ఆదాయపు పన్ను చెల్లించడం మన కర్తవ్యమని ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లిస్తూ దేశాభివృద్ధికి తోడ్పడాలని డీఆర్ఎం నరేంద్ర, ఆనందరావు, పాటిల్ కోరారు. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్, ఆదాయపు పన్ను శాఖల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రైల్వే ఆడిటోరియంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. దేశ ఆర్థికాభివృద్ధిలో ఆదాయ సేకరణ కీలకమని చెప్పారు.

News July 3, 2024

మైలవరం: పింఛన్ల పంపిణీలో VRO చేతివాటం

image

పింఛన్ల పంపిణీలో VRO చేతివాటం చూపిన ఘటన మైలవరంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మైలవరంలోని 5వ సచివాలయ పరిధిలో VROగా పనిచేస్తున్న తరుణ్‌ సోమవారం 43 మందికి పింఛన్‌లు పంచాడు. అనంతరం మరో 7మంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఐరిస్ తీసుకుని సంతకం చేయించుకుని సర్వర్ పనిచేయలేదని తెలిపాడు. చివరికీ రూ.48వేల డబ్బును సొంతానికి వాడుకున్నాడు. విషయం తెలుసుకున్న MPDO, తహశీల్దార్ చర్యలు తీసుకుంటామన్నారు.

News July 3, 2024

విజయవాడ: దేవదాయశాఖ అధికారిణి సస్పెండ్

image

ఉమ్మడి కృష్ణా జిల్లా దేవదాయశాఖ అధికారిణి కె శాంతిని సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు మంగళవారం దేవదాయశాఖ కమిషనర్‌ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఉమ్మడి కృష్ణా జిల్లా దేవదాయశాఖ అధికారిణినిగా ఉన్న ఈమెను బాధ్యతల నుంచి తొలగించగా, తాజాగా ఆమెను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కృష్ణా జిల్లాకు సంధ్యా, ఎన్టీఆర్ జిల్లాకు సీతారావమ్మలను సహాయ కమిషనర్లుగా నియమించారు.