News March 23, 2025
కృష్ణా: బీసీ, కాపు కార్పొరేషన్ రుణ దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు

బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తుల స్వీకరణ తేదీని ఈనెల 25వ తేదీ వరకు పొడిగించినట్టు బీసీ కార్పొరేషన్ కృష్ణా జిల్లా ఈడీ శంకరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన బీసీ, ఈబీసీ, కాపు, కమ్మ, రెడ్డి, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, కాపులు ఈనెల 25వ తేదీలోపు AP-OBMMS ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.
Similar News
News March 25, 2025
ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు అనుమతులు మంజూరు: ఎమ్మెల్యే

గుడివాడ – పామర్రు ప్రధాన రహదారిలో నిర్మిస్తున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని రైల్వే గేట్‌లపై నిర్మించేందుకు సాంకేతిక అనుమతులు మంజూరైనట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. మంగళవారం జాతీయ రహదారుల అథారిటీ అధికారులతో ఎమ్మెల్యే తన స్వగృహంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులపై రివ్యూ నిర్వహించారు. రైల్వే గేట్లపై ఇప్పటివరకు అనుమతులు రాకపోవడంతో బ్రిడ్జి నిర్మాణ పనులు వేగంగా జరగలేదన్నారు.
News March 25, 2025
తాడేపల్లిలో వివాహిత దారుణ హత్య (అప్డేట్)

తాడేపల్లి సమీపంలోని కొలనుకొండ వద్ద ఆదివారం రాత్రి లక్ష్మీ తిరుపతమ్మ (పామర్రుకు చెందిన వివాహిత) హత్యకు గురైన విషయం తెలిసిందే. లక్ష్మీ తిరుపతమ్మతో సన్నిహితంగా ఉండే బిహార్‌కు చెందిన కార్మికులు హత్య చేసినట్లు ఆమె సోదరుడు ఆరోపించాడు. పోలీసులు లక్ష్మీ తిరుపతమ్మ స్నేహితురాలిని, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సోమవారం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి కేసు నమోదు చేశారు.
News March 25, 2025
MTM: అర్జీల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత: ఎస్పీ

మీకోసం కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కృష్ణాజిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను స్పష్టంగా తెలుసుకొని వాటిని చట్టపరిధిలో విచారించి న్యాయం అందించడానికి జిల్లా పోలీస్ శాఖ సిద్ధంగా ఉంటుందన్నారు.