News March 22, 2026
కృష్ణా: ‘బెట్టింగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపండి’

IPL మొదలుకానున్న నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠాల కదలికలపై నిఘా ఉంచాలని ప్రజలు అంటున్నారు. గతంలో బయటపడిన ప్రధాన బుకీల నెట్‌వర్క్‌లో పెడనకు చెందిన వారి పేర్లు ఉండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల గన్నవరంలో బెట్టింగ్ వ్యసనం కారణంగా ఓ యువకుడు బలైన ఘటన మరువకముందే, మరో సీజన్ ప్రారంభం కానుండటం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ముందస్తు చర్యలు తీసుకొని నిఘా ఏర్పాటు చేయాలని కోరారు.
Similar News
News April 14, 2026
భారత ఐక్యతకు రాజ్యాంగం ప్రధానం: కలెక్టర్, ఎస్పీ

విభిన్న కులాలు, మతాలు, భాషలు, సంస్కృతులు కలిగిన దేశం అయినప్పటికీ భారతదేశం ఐక్యంగా నిలబడటానికి ప్రధాన కారణం రాజ్యాంగమని భద్రాద్రి కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత రాజ్యాంగం చాలా తక్కువ సవరణలతో సమర్థవంతంగా కొనసాగుతుండటం అంబేద్కర్ దూరదృష్టికి నిదర్శనమన్నారు. కుల మతాలకు అతీతంగా సమానంగా జీవించడానికి రాజ్యాంగం స్ఫూర్తినిచ్చిందని అన్నారు.
News April 14, 2026
దేశాభివృద్ధికి రాజ్యాంగం పునాది: భద్రాద్రి కలెక్టర్

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రజలు స్వయంగా పరిపాలించుకునే విధంగా రాజ్యాంగం అవసరమైందని కలెక్టర్ అంకిత్ అన్నారు. దేశ వ్యాప్తంగా అనేక మంది మేధావులలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహించగల వ్యక్తిగా గుర్తించబడినట్లు తెలిపారు. భారత రాజ్యాంగం రూపకల్పనలో ఆయన చేసిన కృషి అపూర్వమని, విద్య, ఆర్థిక, నీటిపారుదల రంగాలలో చూపిన దూరదృష్టి దేశాభివృద్ధికి పునాది అయిందన్నారు.