News April 15, 2025
కృష్ణా: మచిలీపట్నంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

పేదలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలో మొత్తం 19 మందికి రూ.16.68లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరయ్యాయి. ఈ చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు.
Similar News
News April 16, 2025
గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకున్న 16వ ఆర్థిక సంఘం

గన్నవరం విమానాశ్రయానికి పనగారియ నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం బృందం చేరుకుంది. రాష్ట్రంలో 4 రోజుల పాటు ఈ ఫైనాన్స్ కమిషన్ బృందం పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా విజయవాడ, తిరుపతి నగరాల్లో ఈ బృందం పర్యటిస్తుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అందాల్సిన సాయం వంటి కీలకమైన అంశాలపై ఫైనాన్స్ కమిషన్ టీమ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల భేటీ కానున్నారు.
News April 16, 2025
కృష్ణా: అంతరించిపోతున్న ఈత బుట్టలు.!

ఓ కాలంలో ప్రతిష్ఠగా నిలిచిన ఈత బుట్టలు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడు, సుంకొల్లు, పామర్రు, గన్నవరం, బాపులపాడు తదితర ప్రాంతాల్లో తయారయ్యేవి. ఈత చెట్ల చువ్వలు కోసి, వాటిని చేతితో నేసి అందంగా తయారు చేసేవారు. పట్టణాల్లోకి వెళ్లి అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవారు. ప్లాస్టిక్ వస్తువులు వచ్చాక ఈ కళ జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోయింది.
News April 16, 2025
గుడివాడ: తమ్ముడి మృతిని తట్టుకోలేక అక్క మృతి

సోదరుడి మృతదేహాన్ని చూసేందుకు విజయవాడ వెళ్లిన మృతుడి సోదరి అంజలి షాక్‌కు గురై చనిపోయిన ఘటన మంగళవారం చోటు చేసుకొంది. స్థానికుల వివరాల మేరకు.. గుడివాడ రూరల్ మండలం దొండపాడుకు చెందిన మాజీ సర్పంచ్ రామాంజనేయులు అనారోగ్యంతో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో మృతిచెందారు. ఈయన భార్య గద్దె పుష్పరాణి ప్రస్తుతం గుడివాడ రూరల్ మండల ఎంపీపీగా ఉన్నారు. తమ్ముడి మృతితో అక్క మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.