News December 27, 2025

కృష్ణా: మామ చేతిలో అల్లుడు దారుణ హత్య.!

image

తోట్లవల్లూరు మండలం పెనమకూరులో మామ చేతిలో అల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో మాటా మాటా పెరగడంతో మామ చీకుర్తి శ్రీనివాసరావు కర్రతో కొట్టగా అల్లుడు ఆదిమూలపు సురేశ్ (31) తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సురేశ్ మృతి చెందాడు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ భార్యతో విజయవాడలో నివసించేవాడు. ఇటీవల కుమార్తె మృతి నేపథ్యంలో వివాదం చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News February 19, 2026

VJA: గాంధీ హిల్స్‌లో ప్రేమ జంటల వెకిలి చేష్టలు..!

image

విజయవాడలోని గాంధీ కొండ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. కొండకు వెళ్లే దారిలో కొందరు బాలలు, యువత జంటలుగా ఉండి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. గాంధీ హిల్‌ని రూ.1.20 కోట్లతో అభివృద్ధి చేయగా, గత ఏడాది అక్టోబర్ 2న CM చంద్రబాబు ప్రారంభించారు. ప్రస్తుతం ఇది టీనేజర్లకు స్వర్గధామంగా మారిందని అక్కడికి వచ్చే కుటుంబ సభ్యులు పెదవి విరుస్తున్నారు. అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

News February 19, 2026

ఢిల్లీ AI సమ్మిట్‌లో బిల్ గేట్స్‌ స్పీచ్ రద్దు

image

ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్’లో బిల్‌ ‌గేట్స్ ప్రసంగం రద్దయినట్లు గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. వివాదాల దృష్ట్యా సదస్సు ప్రాధాన్యం దెబ్బతినొద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో ఫౌండేషన్ ప్రతినిధి అంకుర్ వోరా ప్రసంగించనున్నారు. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్‌’లో బిల్‌ గేట్స్ పేరున్న నేపథ్యంలో ప్రభుత్వమే ఆయన నుంచి దూరం పాటిస్తోందనే వాదనలూ వినిపిస్తున్నాయి.

News February 19, 2026

శ్రీకాకుళం IIITలో వేధింపులపై విచారణ

image

ఎచ్చెర్లలో ఉన్న శ్రీకాకుళం ఐఐఐటీ క్యాంపస్ సిబ్బంది విద్యార్థులను వేధిస్తున్నట్లు గతంలో వచ్చిన ఫిర్యాదుకు అంతర్గత కమిటీ విచారణ చేపట్టింది. బుధవారం ఇంజినీరింగ్ విద్యార్థులను, సిబ్బందిని వేర్వేరుగా విచారణ చేశారు. నూజివీడు క్యాంపస్‌కు చెందిన 6 మంది సభ్యుల కమిటీ విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది.