News December 27, 2025

కృష్ణా: మామ చేతిలో అల్లుడు దారుణ హత్య.!

image

తోట్లవల్లూరు మండలం పెనమకూరులో మామ చేతిలో అల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో మాటా మాటా పెరగడంతో మామ చీకుర్తి శ్రీనివాసరావు కర్రతో కొట్టగా అల్లుడు ఆదిమూలపు సురేశ్ (31) తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సురేశ్ మృతి చెందాడు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ భార్యతో విజయవాడలో నివసించేవాడు. ఇటీవల కుమార్తె మృతి నేపథ్యంలో వివాదం చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News January 10, 2026

సంగారెడ్డి: శిశు గృహాన్ని తనిఖీ చేసిన జిల్లా జడ్జి

image

సంగారెడ్డిలోని శిశు గృహాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి సౌజన్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు అందుతున్న వసతులు, ఆహారం, ఇతర సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారులను తమ సొంత బిడ్డల్లా భావించి సంరక్షించాలని సూచించారు. ఎవరికైనా న్యాయ సహాయం కావాల్సి వస్తే ఉచితంగా అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ తనిఖీ కార్యక్రమంలో శిశు గృహ సిబ్బంది పాల్గొన్నారు.

News January 10, 2026

12న నెల్లూరు జిల్లాకు మాజీ ఉపరాష్ట్రపతి రాక

image

నెల్లూరు జిల్లాలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పర్యటన ఖరారైంది. ఈనెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 12న స్వర్ణ భారత్ ట్రస్ట్‌కు వస్తారు. 17వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు స్వర్ణ భారత్ ట్రస్ట్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు.

News January 10, 2026

శంఖం పూలకు పెరుగుతున్న డిమాండ్

image

ఇప్పటివరకు పెరట్లో పూసే మొక్కగా మాత్రమే చూసిన శంఖం పూలు ఇప్పుడు రైతులకు ఆదాయ మార్గంగా మారుతున్నాయి. సహజ రంగులు, హెర్బల్ టీకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో ఈ పూల సాగు భారీగా పెరుగుతోంది. అస్సాం, UP, WB రాష్ట్రాల్లో మహిళా రైతులు ఈ పంటతో మంచి లాభాలు పొందుతున్నారు. టీ, డై తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తున్న వీటికి అమెరికా, యూరప్‌ మార్కెట్ల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.