News April 16, 2025
కృష్ణా: మొక్కల పెంపకానికి సన్నద్ధం కావాలి – కలెక్టర్

కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తన క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమం పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. బుధవారం కలెక్టర్ మాట్లాడుతూ.. వృక్షో రక్షతి రక్షితః అంటూ మొక్కల పెంపకం కంటే మించిన గొప్ప పనేదిలేదని స్పష్టం చేశారు. వచ్చే వర్షాకాలానికి ముందుగానే రహదారి మార్గాలు, విద్యాసంస్థలు, కాలువలు, చెరువుల గట్ల పైన మొక్కలను నాటి పచ్చదనం పెంపొందించాలని ఆదేశించారు.
Similar News
News September 9, 2025
కృష్ణా: బ్యూటిఫుల్ మూన్

బాపులపాడు గన్నవరం ఉంగుటూరు మండలాలలో ఆకాశం తన అందాలతో మంగళవారం రాత్రి మాయ చేసింది. నింగిలో మెరిసిన నిండు చంద్రుడు ప్రజల చూపులను కట్టిపడేశాడు. వెండి వెలుగులు విరజిమ్ముతూ ప్రకృతి తన మహిమను ఆవిష్కరించింది. నగరాల్లోనూ, గ్రామాల్లోనూ ఆ వెన్నెల విందు చూసేందుకు ప్రజలు ఆసక్తిగా బయటకు వచ్చి చిత్రాల్లాంటి దృశ్యాలను కెమెరాలో బంధించారు. మరి మీ ప్రాంతంలో ఈరోజు చంద్రుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి.
News September 9, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు: కృష్ణా ఎస్పీ
☞ ఉమ్మడి కృష్ణాజిల్లాలో 105 R&B రోడ్లు ధ్వంసం
☞ కృష్ణా జిల్లా వ్యాప్తంగా వైసీపీ అన్నదాత పోరు కార్యక్రమం
☞ మచిలీపట్నం – రేపల్లె రైల్వే లైనుకు కృషి చేయాలి: బాలశౌరి
☞ మోపిదేవి ఆలయంలో భక్తుల రద్దీ
News September 8, 2025
MTM: మీకోసం కార్యక్రమంలో 42 ఫిర్యాదులు

మచిలీపట్నంలో సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ఆర్. గంగాధరరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 42 ఫిర్యాదులు అందగా, ప్రతి సమస్యపై చట్టపరమైన విచారణ జరిపి తక్షణ పరిష్కారం అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. సంబంధిత పోలీస్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.