News March 19, 2024
కృష్ణా: యువతకు ముఖ్య గమనిక
సైబర్ భద్రతపై యువతీ యువకులకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఆధ్వర్యంలో 3 రోజులపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నెల 20 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో జరిగే ఈ శిక్షణకు ఆసక్తి కలిగిన వారు https://skilluniverse.apssdc.in/ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని APSSDC అధికారులు ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.
Similar News
News December 25, 2024
గుడ్లవల్లేరులో క్రికెట్ ఆడేందుకు వెళ్లి యువకుడి మృతి
గుడ్లవల్లేరు మండలం అంగళూరులో గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. మృతుడి స్నేహితుల వివరాల మేరకు.. అంగళూరు గ్రామానికి చెందిన కొమ్మలపాటి సాయి (26) కౌతవరం గ్రామానికి క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. సాయి బౌలింగ్ చేస్తూ హఠాత్తుగా కింద పడిపోయాడు. అప్రమత్తమైన స్నేహితులు గుడివాడ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
News December 25, 2024
కోడూరు: విద్యుత్ షాక్‌తో పంచాయతీ స్వీపర్ మృతి
కోడూరు మండలం పిట్టల్లంకలో విద్యుత్ షాక్‌తో పంచాయతీ స్వీపర్ రంగారావు (54) మృతి చెందారు. ఎస్సై చాణిక్య వివరాల మేరకు.. పంచాయతీలో స్వీపర్‌గా పని చేస్తున్న రంగారావు బుధవారం వాటర్ ట్యాంక్ నిండడంతో స్విచ్ ఆపేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన స్థానికులు అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
News December 25, 2024
RGVకి 15 రోజులు టైం ఇచ్చాం: జీవీ రెడ్డి
ఏపీ ఫైబర్ నెట్‌ను ప్రక్షాళన చేస్తున్నామని ఛైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ‘గత ప్రభుత్వ హాయంలో ఫైబర్ నెట్ నుంచి ఆర్జీవీకి అక్రమంగా డబ్బు చెల్లించారు. డబ్బు తిరిగి చెల్లించేందుకు ఆయనకు 15 రోజుల సమయం ఇచ్చాం. గడువులోగా డబ్బు చెల్లించకుంటే ఆర్జీవీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. గత ప్రభుత్వం నియమించిన 410 మందిని తొలగిస్తాం’ అని తెలిపారు.