News February 19, 2025
కృష్ణా యూనివర్సిటీ వీసీగా పొందూరు వాసి

పొందూరు మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన కూన రాంజీ విజయవాడలోని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు విడుదలయ్యాయి. గతంలో ఆయన ఎచ్చెర్లలోని అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీగా పనిచేశారు. ఈయన నియామకంపై పొందూరు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరెన్నో పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.
Similar News
News February 21, 2025
SKLM: అసభ్యకరమైన పోస్టులు పెడితే జైలుకే..!

సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచేలా అసభ్యకరమైన పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి హెచ్చరించారు. ఈ విషయాన్ని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో సమాజంలోని వ్యక్తులపై, సంస్థలపై గాని హేయమైన, అసత్య ప్రచారాలు, ట్రోలింగ్ చేసిన బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేస్తామన్నారు. తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
News February 20, 2025
SKLM: ఆశా వర్కర్ల శిక్షణాసదస్సు పూర్తి

శ్రీకాకుళం జిల్లా DM&HO కార్యాలయంలో ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్(IGD) ఆధ్వర్యంలో అయోడిన్ లోపంపై ఆశావర్కర్లతో జరుగుతున్న రెండు రోజుల శిక్షణా కార్యక్రమం గురువారంతో ముగిసింది. ఆశా వర్కర్లకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ టీవీ బాలమురళీకృష్ణ ప్రశంసా పత్రాలను అందించారు. ఆశా కోఆర్డినేటర్ రవిప్రసాద్, డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ వాన సురేశ్ కుమార్ ఉన్నారు.
News February 20, 2025
ఏపీయూడబ్ల్యుూజే రాష్ట్ర కౌన్సిల్‌కు జిల్లా జర్నలిస్టులు

APUWJ రాష్ట్ర కౌన్సిల్‌కు జిల్లాకు చెందిన నలుగురు సీనియర్ జర్నలిస్టులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు గురువారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి డీ.సోమసుందర్ వివరాలు వెల్లడించారు. జిల్లాకు చెందిన జర్నలిస్టులు బెండి నర్సింగరావు (టెక్కలి), ఎం.వి మల్లేశ్వరరావు(శ్రీకాకుళం), కొంచాడ రవికుమార్(పలాస), జీ.శ్రీనివాసరావు(పాతపట్నం)లు ఎన్నికయ్యారు. వీరి ఎంపిక పట్ల పలువురు జర్నలిస్టులు అభినందించారు.