News February 14, 2025

కృష్ణా: రీ సర్వే సందేహాల నివృత్తికి హెల్ప్ లైన్ నంబర్

image

జిల్లాలో భూముల రీ సర్వే పైలెట్ ప్రాజెక్టు అమలవుతున్న 23 గ్రామాలలో రైతులు సందేహాల నివృత్తి కోసం జిల్లా సర్వే కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశారు. ఈ సర్వే మీద రైతులకు సందేహాలు, సమస్యలు ఉంటే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5గంటల వరకు 9492271542 నంబర్‌ను సంప్రదించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Similar News

News September 12, 2025

కృష్ణా: వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం

image

ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించే కలెక్టర్‌ల కాన్ఫరెన్స్‌కు అవసరమైన నివేదికలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ డీ.కే. బాలాజి అధికారులు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమావేశమై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.

News September 11, 2025

కృష్ణా: సబ్ జూనియర్ సెపక్ తక్రా క్రీడాకారుల ఎంపిక

image

కృష్ణా జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో సబ్ జూనియర్ బాల, బాలికల జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా కార్యదర్శి పవన్ కుమార్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 13, 14 తేదీలలో అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు నరేష్ పాల్గొన్నారు.

News September 11, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ కృష్ణా: ఈ నెల 13న లోక్ అదాలత్
☞ గరికపర్రులో జిల్లా జూడో జట్లు ఎంపిక
☞ ఉమ్మడి కృష్ణాలో 70 శాతం స్మార్ట్ కార్డుల పంపిణీ
☞ మచిలీపట్నం విజయవాడ హైవే ప్రమాదం.. స్పాట్ డెడ్
☞ కృష్ణా: పెరిగిన గోల్డ్ రేట్స్.. భయపెడుతున్న దొంగతనాలు
☞ చల్లపల్లి పాఠశాల అన్నంలో పురుగులు
☞ చేవేండ్రలో దొంగతనం