News March 30, 2025
కృష్ణా: రేపటి నుంచి పెరగనున్న పాల ధరలు

విజయ పాల ధరను పెంచుతూ కృష్ణామిల్క్ యూనియన్(విజయ డెయిరీ) నిర్ణయం తీసుకున్నట్లు ఛైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. ఈ పెరిగిన ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. విజయ డెయిరీలోని గోల్డ్ పాల ధర ప్రస్తుతం లీటరు రూ.74 ఉండగా తాజాగా పెరిగిన ధరతో రూ.76 కానుంది. ఫుల్ క్రీమ్ లీటరు రూ.72 నుంచి 74 పెరిగినట్లు వెల్లడించారు. కావున ప్రజలు సహకరించాలని కోరారు.
Similar News
News November 3, 2025
కృష్ణా : రేపటి నుంచి One Health డే వారోత్సవాలు

జిల్లాలో వారం రోజులపాటు One Health Day కార్యక్రమం పేరిట అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికలను సోమవారం ఆయన ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు One Health Day వారోత్సవాలపై అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు.
News November 3, 2025
ఎయిడ్స్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ DK బాలాజీ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కమిటీ సమావేశం జరిగింది. ఎయిడ్స్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను కమిటీ సభ్యులతో చర్చించారు. వైద్య పరీక్షల కోసం ART సెంటర్లకు వచ్చే ప్రజలకు అందుబాటులో ఉన్న లేబరేటరీలు, చికిత్స, కౌన్సిలింగ్ సెంటర్లు, ఇతర సౌకర్యాలపై అరా తీశారు.
News November 3, 2025
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

మచిలీపట్నంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఈ నెల 3వ తేదీన ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీ-కోసం’ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ బాలాజీ తెలిపారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫిర్యాదు అభ్యర్థనలు సమర్పించవచ్చని చెప్పారు. జిల్లా ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


