News December 23, 2024
కృష్ణా: రేషన్ బియ్యం కేసు.. అజ్ఞాతంలోకి ఆ ముగ్గురు

రేషన్ బియ్యం కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులు అజ్ఞాతంలో ఉన్నట్లు తాజాగా సమాచారం వెలువడింది. మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ, కుమారుడు కిట్టుతో పాటు గోడౌన్ మేనేజర్ మానసతేజ అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగా నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని నివాసానికి శనివారం పోలీసులు వెళ్లగా.. ఆయన లేకపోవడంతో ఆ ఇంటికి నోటీసులు అంటించామని పోలీసులు పేర్కొంటున్నారు.
Similar News
News March 1, 2026
రేపు కలెక్టరేట్‌లో ‘మీ కోసం’: కలెక్టర్

ఈనెల 2న సోమవారం కృష్ణా జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్‌లో ఉదయం 10:30 గంటల నుంచి ‘మీ-కోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం నేరుగా వచ్చి వినతులు సమర్పించాలన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 1, 2026
అడ్డంకులు అధిగమించి పరిశ్రమలు నెలకొల్పాలి: కలెక్టర్

జిల్లాలో మంజూరైన పరిశ్రమల యూనిట్లను సత్వరమే నెలకొల్పేందుకు ఎదురవుతున్న అడ్డంకులను వెంటనే తొలగించేందుకు చొరవ చూపాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పరిశ్రమల అధికారులు, ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించి మంజూరైన 230 పరిశ్రమల యూనిట్ల పురోగతిపై యూనిట్ల వారీగా సమీక్షించారు.
News February 28, 2026
కృష్ణాజిల్లాలో 91.26% మేర పెన్షన్ల పంపిణీ

కృష్ణాజిల్లాలో తొలి రోజు 91.26% మేర పెన్షన్ల పంపిణీ జరిగిందని డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ హరి హరనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. 2,32,715 పెన్షన్లకు గాను, 2,12,375 పెన్షన్లు పంపిణీ చేసినట్టు తెలిపారు. 92,38,80,000 మేర పెన్షన్ సొమ్మును అందజేశామన్నారు. మిగిలిన వారికి సోమ, మంగళవారాల్లో అందజేస్తామన్నారు.


