News February 28, 2026
కృష్ణా: రేషన్ మాఫియా మాయాజాలం!

విజయవాడ సహా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రేషన్ మాఫియా రాజకీయ అండతో రెచ్చిపోతోందనే విమర్శలొస్తున్నాయి. పేదల బియ్యంపై ఏకంగా వేలం పాటలు నిర్వహిస్తూ, గెలిచిన వారు ప్రజాప్రతినిధులకు నెలకు రూ.10 నుంచి 15లక్షల వరకు ముట్టజెబుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాము అనే వ్యక్తి సిండికేట్‌గా మారి రేషన్ విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం. పేదల పొట్ట కొట్టి ఇలా వ్యాపారం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Similar News
News March 2, 2026
ఖమ్మం: బంగ్లాదేశ్ నుంచి నకిలీ సిగరెట్ల హవాలా

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నకిలీ సిగరెట్ల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. బంగ్లాదేశ్ నుంచి హవాలా మార్గంలో వీటిని దిగుమతి చేస్తూ, ఖమ్మం నుంచి భద్రాచలం వరకు భారీ నెట్‌వర్క్‌ను నడుపుతున్నారు. అధిక మత్తు కోసం కెమికల్స్ వాడుతుండటంతో వినియోగదారులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. అధికారులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారని, కోట్ల రూపాయల ఈ అక్రమ దందాను అరికట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
News March 2, 2026
విశాఖ: నకిలీ పత్రాలతో బురిడీ.. రూ.28 లక్షలు కాజేశాడు

పెందుర్తిలో రియల్ ఎస్టేట్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఒడిశాకి చెందిన నిందితుడు నబీనా బాఘాను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు ప్రసాద్ బాబుకు నకిలీ పత్రాలతో స్థలం అమ్ముతామని నమ్మించి రూ.28 లక్షలు కాజేశారు. ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్ సూచనలతో SI భాస్కరరావు బృందం నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఆదివారం తెలిపారు. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
News March 2, 2026
VZM: పశు మాంసం విక్రయిస్తున్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఎస్.కోట మండలం గోపాలపల్లి SC కాలనీ వద్ద పశు మాంసాన్ని విక్రయిస్తున్న షేక్ బాషా, సుల్తాన్ అనే వ్యక్తులను ఆదివారం ఎస్.కోట పోలీసులు అరెస్టు చేశారు. గొర్రెలు పెంపకం పేరుతో షెడ్డు వేసుకొని, పశువులను వధించి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి వారి నుంచి మాంసాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని CI నారాయణమూర్తి తెలిపారు.


