News October 7, 2025
కృష్ణా: రైతులకు నష్టం.. దళారులకు లాభం

టమాటాకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చేస్తున్నారు. కర్నూలు మార్కెట్లో అయితే ధర లేక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కేజీ రూ.2కి కూడా రాని పరిస్థితి ఉందని అక్కడ వాపోతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూస్తే స్థానిక మార్కెట్లలో కిలో రూ.40 చొప్పున విక్రయించడంపై వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. రైతుకు ధర రాక, దళారులు పరిస్థితిని సొమ్ము చేసుకుంటూ అధిక ధరలకు అమ్ముతున్నారన్న ఆరోపణలొస్తున్నాయి.
Similar News
News October 7, 2025
10 వీక్లీ స్పెషల్ ట్రైన్ల టర్మీనల్ మార్పు

తిరుపతి రైల్వే స్టేషన్ వరకు నడిచే పది ట్రైన్స్ టెర్మినల్స్‌ను దక్షిణ మధ్య రైల్వే మార్పు చేసింది. వీక్లీ స్పెషల్ కింద నడిచే పది ట్రైన్స్ తిరుచానూరు స్టేషన్ వరకు నడవనున్నాయి. 07609, 07610, 07251, 07252, 07015, 07016, 07009, 07010, 07017, 07018 ట్రైన్స్ ఇకపై తిరుచానూరు స్టేషన్ నుంచి నడవనున్నాయి.
News October 7, 2025
పైడిమాంబకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం

పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం సందర్భంగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అమ్మవారిని మంగళవారం దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించి ఆశీర్వచనాలు పొందారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. కాగా నిన్న రాత్రి తొలేళ్ల ఉత్సవం జరగ్గా.. ఈరోజు సాయంత్రం సిరిమానోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
News October 7, 2025
సిద్దిపేట: వాల్మీకి జయంతి వేడుకల్లో కలెక్టర్

సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో కలెక్టర్ కె.హైమావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ రోజును జాతి గుర్తుంచుకోవాలని, ప్రపంచం ఉన్నంతవరకు రామాయణం, వాల్మీకి చరిత్ర ఉంటుందని ఆమె పేర్కొన్నారు.