News June 11, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య విజ్ఞప్తి

image

ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా నరసాపురం, భీమవరం, మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చే నాలుగు రైళ్లు జూన్ 24 నుంచి జూలై 28 వరకు రామవరప్పాడు వరకు మాత్రమే నడుస్తాయి. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. మచిలీపట్నం(02), నరసాపురం(01), భీమవరం(01) వైపు వెళ్లే ఈ రైళ్లు విజయవాడకు బదులుగా రామవరప్పాడు నుంచి బయలుదేరతాయని రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రయాణికులు గమ్యస్థానంలో మార్పును గమనించాలని కోరాయి. 

Similar News

News February 24, 2026

కృష్ణా: మరి కాసేపట్లో ఇంటర్ సెకండియర్ పరీక్షలు

image

కృష్ణా(D)లో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన 63 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 25,406 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 900 మంది ఇన్విజిలేటర్లతో పాటు అదనంగా 3 సిట్టింగ్‌, 3 ఫ్లైయింగ్‌ స్క్వాడ్లు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించనున్నాయి. విద్యార్థులు ఉదయం 8.30 గంటలలోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

News February 24, 2026

28న గన్నవరంలో జాబ్ మేళా

image

ఈనెల 28న ఉదయం 9 గంటలకు గన్నవరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు గన్నవరం ఎమ్మెల్యే వెంకటరావు సోమవారం తెలిపారు. SSC, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, బీ టెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. 18-35 ఏళ్ల వయసున్నవారు పాల్గొనవచ్చన్నారు. ఈ మేళాలో ప్రముఖ సంస్థలు పాల్గొని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు.

News February 24, 2026

ప్రజల అర్జీలకు అధిక ప్రాధాన్యత: కలెక్టర్

image

ప్రజల నుంచి అందే అర్జీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి, సకాలంలో సానుకూలంగా పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం మచిలీపట్నంలో జాయింట్ కలెక్టర్ నవీన్‌తో కలిసి ప్రజల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. ఉద్యోగుల గ్రీవెన్స్‌డే నిర్వహించి వివిధ శాఖల ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం మీ-కోసం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు.