News March 26, 2024
కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య విజ్ఞప్తి

ట్రాక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున నరసాపురం, మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చే ఎనిమిది రైళ్లు ఏప్రిల్ 1 నుంచి 28 వరకు రామవరప్పాడు వరకు మాత్రమే – నడవనున్నాయి. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయా తేదీలలో మచిలీపట్నం, నరసాపురం వైపు వెళ్లే ఈ రైళ్లు విజయవాడకు బదులుగా రామవరప్పాడు నుంచి బయలుదేరతాయని రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రయాణికులు గమ్యస్థానంలో మార్పును గమనించాలని కోరాయి.
Similar News
News March 17, 2025
కృష్ణా: ప్రజా సమస్యలు పరిష్కరించండి- ఎస్పీ

కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఆర్ గంగాధర రావు పాల్గొని 44 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులతో స్వయంగా మాట్లాడి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సంబంధిత పోలీస్ అధికారులు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు.
News March 17, 2025
కృష్ణా: జిల్లాలో పదో తరగతి పరీక్షకు 286 మంది గైర్హాజరు

పదవ తరగతి పరీక్షలు కృష్ణాజిల్లాలో సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని డీఈఓ రామారావు తెలిపారు. తొలి రోజు నిర్వహించిన తెలుగు పరీక్షకు 21,162 మంది విద్యార్థులకు 20,876 మంది హాజరయ్యారన్నారు. 286 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన 4, DLO అధికారులు 2, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ 2 కేంద్రాలను పరిశీలించారన్నారు.
News March 17, 2025
కృష్ణా: ‘టెన్త్ పరీక్షలకు యూనిఫామ్ అనుమతి లేదు’

పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ అనుమతి లేదని (గవర్నమెంట్ ఎగ్జామ్స్) అసిస్టెంట్ కమిషనర్ ఎమ్ డేవిడ్ రాజు తెలిపారు. సోమవారం స్వతంత్ర పురం జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన ఘటనపై యూనిఫామ్ అనుమతి ఉందా, లేదా అన్న విషయంపై (ఎమ్ డేవిడ్ రాజును పాత్రికేయులు వివరణ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరీక్షా సమయంలో యూనిఫామ్ అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు.